Begin typing your search above and press return to search.
'ట్విట్టర్'లో మెగా అభిమానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి..!
By: Tupaki Desk | 2 April 2021 9:00 PM ISTగతేడాది ఉగాది పండుగ సందర్బంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ట్విట్టర్ వేదికగా ఖాతా తెరిచి అభిమానులకు దగ్గరవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు అందరూ ఏదో ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఖాతాలు ఉపయోగిస్తూ యాక్టీవ్ గా ఉంటుంటారు. ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే విషయాలను పోస్ట్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో జూనియర్ హీరోస్ నుండి సీనియర్ స్టార్స్ వరకు అందరూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరై దాదాపు ఏడాది కావస్తుంది. అంటే ఏడాది కాలంగా ఆయన ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇదివరకు చిరు అభిమానులకు కేవలం ఆడియో లాంచ్ లేదా సినిమా వేడుకల్లో మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు ఆ బాధలేదు. అందరికంటే యాక్టీవ్ గా ఆయనే ఉంటున్నారు. మెగాస్టార్ సోషల్ మీడియాలో అడుగు పెట్టడం మెగా ఫ్యాన్స్ కు పండుగే అయిపోయింది.
ఆయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినప్పటి నుండి కొత్త సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఐతే ట్విట్టర్ లో ఖాతా తెరిచారు. లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు అంతా బాగానే ఉంది. మరి మెగాస్టార్ ఎవరిని ఫాలో అవుతున్నాడు అనే విషయం అందరిలో ఆసక్తిరేపుతోంది. మెగాస్టార్ చిరంజీవి మొన్నటివరకు ఎవరిని ఫాలో అయ్యాడు అనే విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. అదికూడా లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిని మాత్రమే. మరి ఆయన మీద అభిమానంతో ఫాలో అవుతున్నారా లేక వేరే కారణాలు ఉన్నాయో తెలియదు కానీ.. రామజోగయ్య ఒక్కరినే ఫాలో అవ్వడం గమనార్హం. ఈ విషయం శాస్త్రికి తెలిసి.. జీవితాంతం మెగాస్టార్ కు రుణపడి ఉంటానని.. కొండంత సంతోషంగా ఉన్నానని ఎమోషనల్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త మెగావార్తగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.