Begin typing your search above and press return to search.

నెగిటివ్ రోల్స్ చేసే ఏకైక హీరోయిన్..!

By:  Tupaki Desk   |   20 Feb 2021 2:00 PM IST
నెగిటివ్ రోల్స్ చేసే ఏకైక హీరోయిన్..!
X
హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ షో చేయడమే కాదు.. ఎలాంటి రోల్స్ చేయడానికైనా రెడీగా ఉండాలని ప్రూవ్ చేస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఒకప్పటి హీరోయిన్స్ తరహాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటించడానికి వరు సిద్ధపడుతోంది. 'పందెం కోడి 2' 'తెనాలి రామకృష్ణ' సినిమాలలో లేడీ విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవల వచ్చిన 'క్రాక్' సినిమాలో వరలక్ష్మి 'జయమ్మ'గా కనిపించిన మెయిన్ విలన్ ని మించి క్రేజ్ దక్కించుకుంది. ఇక నిన్న విడుదలైన 'నాంది' సినిమాలో ఈ బ్యూటీకి హీరో రేంజ్ క్యారెక్ట‌ర్ ఇచ్చేశారని కామెంట్స్ వస్తున్నాయి. ఈ విధంగా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తెలుగులో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటోంది.

అయితే ఈ బ్యూటీని అటు నెగిటివ్ రోల్స్ లో ఇటు పాజిటివ్ రోల్స్ లోనూ ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వరలక్ష్మీ కి కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీలో ఓ కీల‌క పాత్ర ఆఫ‌ర్ చేసిన‌ట్లుగా స‌మాచారం. అలానే అఖిల్ అక్కినేని - సురేంద‌ర్ రెడ్డి కాంబోలో వచ్చే మూవీలో కూడా ఈ బ్యూటీకి ఆఫ‌ర్ వచ్చిందని టాక్. ఏదేమైనా ప్ర‌స్తుతం సౌత్ లో నెగిటివ్ రోల్ చేసే ఏకైక హీరోయిన్ గా వ‌ర‌ల‌క్ష్మీ పేరు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీకి పోటీగా రెజీనా కసండ్ర కూడా రింగ్ లోకి వచ్చింది. కాకపోతే రెజీనా పూర్తిగా త‌న కెరీర్ ని నెగిటివ్ ట్రాక్ లోకి తీసుకువెళ్లిపోవడంతో అమ్మడు వరలక్ష్మికి పోటీయే కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.