Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నాల టెనెట్ వ‌సూళ్ల‌ను అధిగ‌మించిన ఏకైక చిత్రం!

By:  Tupaki Desk   |   20 April 2021 1:30 AM GMT
సంచ‌ల‌నాల టెనెట్ వ‌సూళ్ల‌ను అధిగ‌మించిన ఏకైక చిత్రం!
X
మ‌హ‌మ్మారీ భ‌యాల న‌డుమ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజై రికార్డ్ బ్రేకింగ్ వ‌సూళ్ల‌ను సాధించింది టెనెట్. ఆస్కార్ గ్ర‌హీత అయిన‌ ది గ్రేట్ డైరెక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన చిత్రంగా గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. కేవ‌లం మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద న‌ష్ట‌పోయినా క‌రోనా క‌ల్లోలంలోనూ ఒక అరుదైన‌ రికార్డును అందుకుంది.

ఇప్పుడు టెనెట్ సృష్టించిన రికార్డుల్ని గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ బ్రేక్ చేసింది. ఈ చిత్రం మ‌హ‌మ్మారీ భ‌యాల న‌డుమ రిలీజైనా అన్నివ‌ర్గాల ఆడియెన్ ని ఆక‌ర్షించింది. టికెట్ విండో వ‌ద్ద ఇత‌ర సినిమాల‌తో పోలిస్తే ఆధిపత్యం కొనసాగించింది. అంతర్జాతీయ మార్కెట్లలో గత వారాంతంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన టెనెట్ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా 390 మిలియన్ డాలర్లతో గాడ్జిలా వర్సెస్ కాంగ్ ప్ర‌పంచ‌వ్యాప్త‌ రికార్డ్ సృష్టించింది. టెనెట్ ఫుల్ రన్ ను ఈ సినిమా రెండువారాల క్రితమే అధిగ‌మించింది.

తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు మహమ్మారి మధ్య అమెరికాలోనూ అత్యధిక వసూళ్లు చేసిన హాలీవుడ్ చిత్రంగా స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది. విడుదలైన మూడవ వారాంతంలో ఉన్న ఈ చిత్రం మరో 7.7 మిలియన్లను జోడించి ఉత్తర అమెరికాలో 80.5 మిలియన్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి యుఎస్ కెనడాలో 100 మిలియన్ డాల‌ర్ల‌ను దాటిన మొదటి చిత్రం ఇదే. అమెరికా వ్యాప్తంగా సినిమా థియేటర్లు తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఈ రికార్డ్ అరుదైన‌ది.

పెద్ద థియేటర్ ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ OTT ప్లాట్ ఫామ్ లలో కూడా అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్లలో 50 కోట్ల రూపాయలు సంపాదించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 390 మిలియన్ డాలర్లను అధిగ‌మించింది.

చైనాలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అత్యధికంగా 177 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో 19.1 మిలియన్ డాలర్లు.. మెక్సికోలో 17.3 మిలియన్ డాలర్లు.. తైవాన్ లో 12.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విదేశీ వసూళ్ళలో ఒక్క ఐమాక్స్ 28.4 మిలియన్ డాలర్లు వసూలు చేసి 9 శాతం కలెక్షన్లను సాధించ‌డం ఆస‌క్తిక‌రం.

ఇంత‌కీ ఈ సినిమా క‌థేమిటి? అంటే .. త‌న‌ నిజమైన ఇంటిని కనుగొనడానికి కాంగ్ అతని రక్షకులు ఒక ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టాక వారితో జియా అనే యువ అనాథ అమ్మాయి క‌లుస్తుంది. ఆ అమ్మాయితో కాంగ్ ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన బంధాన్ని ఏర్పరచుకుంటాడు. కానీ వారు ఊహించ‌ని విధంగా కోపంతో ఉన్న గాడ్జిల్లా మార్గంలో వెళుతున్న విష‌యాన్ని తెలుసుకుంటారు. ఆ త‌ర్వాత ప్రపంచ వినాశనం మొద‌ల‌వుతుంది. రెండు టైటాన్ల మధ్య ఘర్షణ - కనిపించని శక్తులచే ప్రేరేపించబడినది. ఆ ర‌హ‌స్యం ఏమిట‌న్న‌దే ఈ సినిమా. ఈ చిత్రానికి ఆడమ్ వింగార్డ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇందులో అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్- మిల్లీ బాబీ బ్రౌన్ - రెబెక్కా హాల్ నటించారు.