Begin typing your search above and press return to search.

'ఆచార్య' ఆ పుకారే నిజం.. అఫిషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది

By:  Tupaki Desk   |   13 April 2021 5:35 AM GMT
ఆచార్య ఆ పుకారే నిజం.. అఫిషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది
X
మెగాస్టార్‌ చిరంజీవి.. రామ్ చరణ్‌ లు కలిసి నటించిన ఆచార్య సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేసి వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మొన్నటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. కాని షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టడం ఖాయం కాని సినిమా వచ్చే నెలలో విడుదల చేయడం మాత్రం సాధ్యం కావడం లేదంటూ సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆచార్య సినిమా విడుదల తేదీని మార్చేయడం ఖాయం అంటూ వచ్చిన పుకార్లు నిజం చేస్తూ మేకర్స్‌ సినిమా విడుదల తేదీ విషయంలో ఆలోచనలో పడ్డారట.

టాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమాను అనుకున్న సమయంకు పూర్తి చేసి విడుదల విషయంలో మాత్రం ఆలోచించాలని భావిస్తున్నారట. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా లక్షన్నర కేసులు నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో రెండు మూడు లక్షల కేసులు కూడా ఒక్క రోజులో నమోదు అవ్వడం మనం చూస్తామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దాదాపుగా అయిదు నుండి ఆరు వారాల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

ఇంతగా కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే చాలా భయపడుతున్నారు. ఒక వేళ జనాలు థియేటర్లకు వచ్చినా కూడా పెద్ద ఎత్తున వైరస్ బారిన పడుతారు. అందుకే థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సి నిబంధన పెట్టే అవకాశం ఉంది. ఇన్ని ఎదురీతల నడుమ ఆచార్యను విడుదల చేయడం అవసరం లేదు అనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆచార్య విడుదల తేదీ మారిన విషయం అధికారికంగా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూన్‌ లేదా జులై నెలల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.