Begin typing your search above and press return to search.

క‌ట్టుబాట్ల‌కు లొంగి హాలీవుడ్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం వ‌దులుకున్న తార‌

By:  Tupaki Desk   |   1 Nov 2020 2:00 PM IST
క‌ట్టుబాట్ల‌కు లొంగి హాలీవుడ్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం వ‌దులుకున్న తార‌
X
మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్(47) స్టార్ డ‌మ్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఐష్‌ కెరీర్ జ‌ర్నీ ఎఫైర్ మ్యాట‌ర్స్ గురించి ప్ర‌త్యేకించి తెలియాల్సిందేమీ లేదు. ప్ర‌తిదీ ఓపెన్ సీక్రెట్. 2004 నాటికే ఐష్ పెద్ద స్టార్. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకుంది. హమ్ దిల్ దే చుకే సనమ్- తాళ్‌- దేవదాస్- మొహబ్బతేన్ వంటి హిట్స్ ఇచ్చిన తరువాత ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లోనే ది బెస్ట్ స్టార్ గా ఎదిగారు. ప‌రిశ్ర‌మ‌లో అంద‌రు అగ్ర నిర్మాత‌లు.. ద‌ర్శ‌కుల‌తోనూ ప‌ని చేసిన క్రేజీ స్టార్. ఇక ఐశ్వ‌ర్యారాయ్ అందం గురించి అస‌లే చెప్పాల్సిన ప‌నే లేదు. వ‌య‌సు పెరిగే కొద్దీ అందం పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు.

ఐశ్వర్య రాయ్ కి ఈ సంవత్సరంతో 47 ఏళ్ళు నిండాయి. అంటే 50కి చేరువైపోతోంద‌న్న ఊహే క‌ష్టంగా ఉంది అభిమానుల‌కు. మాజీ మిస్ వరల్డ్ కేవలం ప్రముఖ బాలీవుడ్ నటి మాత్రమే కాదు హాలీవుడ్ లోనూ త‌న పేరు ఫేమ‌స్. ప్రతి సంవత్సరం కేన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్య హంస న‌డ‌క‌ల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.

అంతర్జాతీయ సినిమాల్లో అగ్ర‌ తారలతో కలిసి పనిచేసే అవ‌కాశాల్ని ఐష్‌ తిరస్కరించకపోతే ఈపాటికే హాలీవుడ్ అగ్ర క‌థానాయికగా రాజ్య‌మేలేసేదే. కేవ‌లం భార‌తీయ సాంప్ర‌దాయం క‌ట్టుబాట్లు ఐష్ మోకాలికి బంధం బిగించాయ‌న్న సంగ‌తి కూడా విధిత‌మే. నిజానికి గురిందర్ చ‌ద్ధా రొమాంటిక్ డ్రామా `బ్రైడ్ అండ్ ప్రిజూడీస్`‌తో ఐశ్వర్య తన హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె మొట్టమొదటి ఇంగ్లీష్ ప్రాజెక్ట్ తోనే హాలీవుడ్ క్రిటిక్స్ ని మెప్పించింది. జేన్ ఆస్టెన్ 1813 నవలకు బాలీవుడ్ తరహా అనుసరణకు విమర్శకులలో ప్ర‌శంస‌లు ద‌క్కాయి. మార్టిన్ హెండర్సన్- నవీన్ ఆండ్రూస్- నమ్రతా శిరోద్కర్- సోనాలి కులకర్ణిలతో సహా ఇంగ్లీష్ బాలీవుడ్ తారాగణాల కలయికతో ఈ చిత్రం ఇంగ్లీష్ మాట్లాడే ప్రేక్షకులకు చేరడమే కాదు,... భారతీయ ప్రేక్షకుల్లోనూ పాపుల‌రైంది. ఐశ్వర్య న‌టించిన ప్రోవోక్డ్ తన మొదటి విషాద డ్రామా చిత్రంగా పాపుల‌రైంది.

ఐశ్వర్య ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్- ది పింక్ పాంథర్ 2 - ది లాస్ట్ లెజియన్ సహా కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ మెరిసింది. కానీ బాలీవుడ్ లో ఆమె సాధించిన విజయాన్ని అక్క‌డ‌ ప్రతిబింబించలేకపోయింది. అయినా అనేక ఇతర ప్రయత్నాలతో విదేశాలలో పేరు తెచ్చుకుంది. ప్ర‌తియేటా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య భారతీయ నటుల గురించి ఎక్కువగా మాట్లాడి ఆక‌ర్షిస్తుంది. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ఆమె కొత్త స్థాయికి చేరుకుంది. ఐష్‌ కుమార్తె ఆరాధ్యతో కలిసి ఫ్రెంచ్ రివేరాకు వెళుతుంటుంది.

ఐశ్వర్య తన హాలీవుడ్ వెంచర్లతో చ‌ర్చ‌ల్లోకి రావ‌డ‌మే కాదు,.. తన జీవితంలో కొన్ని పెద్ద ఆఫర్లను తిరస్కరించినందుకు కూడా వార్తల్లో నిలిచింది. బ్రాడ్ పిట్ నటించిన `ట్రాయ్` ఆఫ‌ర్ తొలిగా ఐసూదే. కానీ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి సౌకర్యంగా లేనందున‌ ఆమె తిరస్కరించింది. ఈ పాత్ర చివరకు రోజ్ బైర్న్ కు వెళ్ళింది. బ్రాడ్ ఒకసారి ఐష్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని ఎంత‌గానో త‌పించినా నో ఛాన్స్ అనేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది.

బ్రాడ్ మాత్రమే కాదు.. విల్ స్మిత్ కూడా ఐశ్వర్యతో కలిసి పనిచేయలేకపోయాడు. అతను ఆమె హిచ్... సెవెన్ పౌండ్స్ .. టునైట్ హి కమ్స్ వంటి ప్రాజెక్టులను ఆఫ‌ర్ చేశాడు. కాని ఆమె న‌టించేందుకు అంగీక‌రించ‌లేదు. టునైట్ హి కమ్స్ లో పనిచేసే అవకాశాన్ని తిరస్కరించాల్సి వచ్చింది. కుటుంబ కట్టుబాట్ల కారణంగా చాలా చాలా వ‌దులుకోవాల‌ని ఐష్‌ నిర్ణయించుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.