Begin typing your search above and press return to search.

టాలీవుడ్ యాక్టర్స్ మరియు డైరెక్టర్స్ ని వెంటాడుతున్న కొత్త భయం...?

By:  Tupaki Desk   |   13 Jun 2020 1:20 PM IST
టాలీవుడ్ యాక్టర్స్ మరియు డైరెక్టర్స్ ని వెంటాడుతున్న కొత్త భయం...?
X
కరోనా మహమ్మారి వలన దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ మూతపడిపోయింది. దీంతో సినిమా షూటింగులు ఆగిపోయి.. థియేటర్స్‌ లో సినిమా విడుదలై చాలా రోజులైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని షరతులతో షూటింగులకు అనుమతిస్తున్న ప్రభుత్వాలు థియేటర్స్ రీ ఓపెనింగ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షూటింగులకు అనుమతులు రావడంతో ప్రొడ్యూసర్స్ తమ సినిమాల చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యాక్ట‌ర్ల‌కి, టెక్నీషియ‌న్ల‌కి, డైరెక్ట‌ర్ల‌కి ఇప్పుడు కొత్త భ‌యం ప‌ట్టుకుందట. ఈ భయం వలన చాలా మంది స్టార్ హీరోలు షూటింగ్స్ కి రావ‌డానికి ఇష్టప‌డటం లేదట. ఇంత‌కీ వారి భ‌యం ఏంటంటే.. ఓటీటీల ప్రభావం థియేట‌ర్లు, డిస్ట్రీబ్యూట‌ర్ల మీదే కాకుండా తమ మీద కూడా పడబోతోందని ఆలోచిస్తున్నారట.

వివరాల్లోకి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హీరోల‌తో సినిమాలు తీసే నిర్మాత‌ల‌కి ఫైనాన్స్ దొరకడం క‌ష్టం అవుతుందట. అయితే ఈ పరిస్థితిని అనువుగా తీసుకొని కొన్ని ఓటీటీలు డైరెక్ట్ రిలీజ్ స్లాట్ అంటూ నిర్మాత‌ల‌కి గాలం వేస్తున్నాయట. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అవుతాయో లేదో అని భయపడుతున్న ప్రొడ్యూసర్స్ మాత్రం ఓటీటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారట. దీంతో ఇప్పటిదాకా ఈ ఓటీటీల ప్ర‌భావం థియేట‌ర్లు, డిస్ట్రీబ్యూట‌ర్ల మీదే కాకుండా ఇకపై యావ‌రేజ్, బిలో యావ‌రేజ్ రేంజ్ ఉన్న యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్ల భవిష్యత్ పై దెబ్బేసే ఛాన్సెస్ ఉన్నాయట. ఎందుకంటే వీరు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు.. సైన్ చేసే సినిమాలు షూట్ కి వెళ్లే లోపే ఓటీటీ రిలీజ్ చేసేలా కొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఒప్పందాలు చేసుకుంటున్నాయట.

దీంతో ఒక సినిమా కాక‌పోయినా ఆ త‌రువాత సినిమా నుంచైనా వీరి మార్కెట్.. అలానే రెమ్యూనరేషన్ తగ్గిపోయే అవకాశాలున్నాయని.. లేదా పారితోషకాలు ఒకే రేంజ్ లో కొన‌సాగే అవ‌కాశం ఉందని వారు భయపడుతున్నారట. అంటే 'ఫిక్సడ్ సాల‌రీ వితౌట్ హైక్స్' మాదిరి అన్నమాట. మరీ ముఖ్యంగా క్రేజ్ ఉన్న వారు.. మార్కెట్ ఉన్న వారే ఎక్కువుగా భ‌య‌ప‌డుతూ వారి స‌న్నిహితుల‌తో చెప్పుకొని వాపోతున్నారట. అందువలన షూటింగ్ స్టార్ట్ అవకముందే ఓటీటీలతో ఒప్పందాలు చేసుకుంటున్న సినిమాల చిత్రీకరణలో పాల్గొనడానికి ఆలోచిస్తున్నారట.