Begin typing your search above and press return to search.

కొత్త బిగ్ బాస్ వచ్చేశాడు... షూటింగ్ షురూ

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:15 AM GMT
కొత్త బిగ్ బాస్ వచ్చేశాడు... షూటింగ్ షురూ
X
సుదీర్ఘ కాలంగా హిందీ బిగ్‌ బాస్ కు సల్మాన్ ఖాన్‌ హోస్టింగ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. నాలుగు సంవత్సరాల క్రితం సౌత్‌ లో కూడా బిగ్‌ బాస్ సందడి మొదలు అయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఈ షో కు మంచి ఆధరణ దక్కింది. తమిళంలో యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ వరుసగా అయిదు బిగ్ బాస్‌ సీజన్‌ లకు హోస్టింగ్‌ చేయడం జరిగింది. తెలుగు లో ఎన్టీఆర్‌ మొదటి సీజన్ కు.. రెండవ సీజన్ కు నాని హోస్టింగ్‌ చేయగా ఆ తర్వాత వరుసగా నాని హోస్టింగ్‌ చేస్తున్నాడు.

తెలుగు బిగ్‌ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌ ను రేపటి నుండి మొదలు పెట్టబోతున్నారు. నాగార్జున ఓటీటీ వర్షన్ కు కూడా హోస్టింగ్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. కాని తమిళంలో మాత్రం కమల్‌ బిగ్ బాస్ నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. వరుసగా అయిదు సీజన్ లు చేసిన కమల్‌ హాసన్ డిజిటల్‌ బిగ్ బాస్ ను చేయలేక పోతున్నట్లుగా పేర్కొన్నాడు. విక్రమ్‌ షూటింగ్‌ మరియు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ కారణంగా బిగ్‌ బాస్ అల్టిమేట్‌ కు డేట్లు కేటాయించలేక పోతున్నట్లుగా ప్రకటించాడు.

రెగ్యులర్‌ బిగ్‌ బాస్ కు మళ్లీ కమల్ హాసన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే బిగ్‌ బాస్ అల్టిమేట్‌ కు హోస్ట్‌ గా ఎవరు చేస్తారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళం స్టార్‌ హీరోల పేర్లు చాలానే వినిపించాయి. అజిత్ మొదలుకుని సూర్య.. కార్తి వరకు చాలా మంది పేర్లు ప్రచారం జరిగింది. అని అనూహ్యంగా షో నిర్వాహకులు యంగ్‌ స్టార్‌ హీరో శింబును ఈ షో కు ఎంపిక చేయడం జరిగింది.

కొందరు హీరోలను సంప్రదించగా నో చెప్పారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ లేదు కాని శింబు ఈ షో కు హోస్ట్‌ గా రాబోతున్నాడు అంటూ క్లారిటీ వచ్చేసింది. బిగ్‌ బాస్ షో కోసం శింబు నేటి నుండి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. షో కు సంబంధించినంత ప్రోమో షూట్‌ లో శింబు కనిపిస్తున్నాడు. శింబు నటుడిగా ఇప్పటికే మంచి పేరు దక్కించుకున్నాడు. హోస్ట్‌ గా ఈయన కొత్త జర్నీ ఎలా ఉంటుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళ వివాదాస్పద నటుడిగా శింబుకు పేరు ఉంది. కనుక ఆయన ఈ షో ను ఎలా నడిపిస్తాడు అనేది కూడా చూడాలి. గత సీజన్‌ లకు కమల్‌ హాసన్ హోస్టింగ్‌ చేశాడు కనుక ఈ సీజన్‌ కొత్త హోస్ట్‌ ను జనాలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనేది కాస్త చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ హోస్ట్‌ అంటే చాలా బ్యాలన్స్ తో వ్యవహరించాలి.

తప్పు చేసిన వారికి మందలించడంతో పాటు ఇతర విషయాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ట్రోల్స్ తప్పవు. కనుక శింబు ఎలా ఈ షో ను బ్యాలన్స్ చేస్తాడు అనేది చూడాలి.