Begin typing your search above and press return to search.

అబ్బా.. పిల్ల చంపేసింది

By:  Tupaki Desk   |   6 May 2019 1:47 PM GMT
అబ్బా.. పిల్ల చంపేసింది
X
సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది రాత్రికి రాత్రి సూపర్‌ స్టార్స్‌ అయిపోతున్నారు. కేవలం సోషల్‌ మీడియా వల్లే ప్రియా వారియర్‌కు పిచ్చ క్రేజ్‌ వచ్చిందన్న సంగతి అందరికి తెలిసింది. ఇప్పుడు అలాంటి క్రేజే ఓ కుర్రపిల్లకు వచ్చింది. ఆమె ఎవరో తెలియదు - ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ క్రికెట్‌ ప్రేమికులంతా ఆ పిల్ల ఎవరు అని మాట్లాడుకుంటున్నారు. చివరకు ఆర్‌సీబీ కెప్టెన్‌ అయిన విరాట్‌ కోహ్లీ కూడా ట్విట్టర్‌ సాక్షిగా రెస్పాండ్ అయ్యాడు. ఈ అమ్మాయిని మన ప్రతీ మ్యాచ్‌ కు ఇన్ వైట్‌ చేయాల్సిందేనంటూ కామెంట్‌ చేశాడు. ఇంతకూ ఎవరీ అమ్మాయి.

క్యూట్‌ గా - హాట్‌ గా కాస్త యాటిట్యూడ్‌ చూపించే అమ్మాయిలకు ఈ లోకం ఫిదా అయిపోయింది. అదిగో అలాంటి లక్షణాలతో ఒక అమ్మాయి… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కు వచ్చింది. సాధారణంగా అందంగా ఉన్న అమ్మాయిల్ని చూపించడం కెమెరామ్యాన్స్‌ కు అలవాటు. కానీ ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి కెమెరా మ్యాన్‌ తన కెమెరాను తిప్పలేకపోయాడు. చాలాసేపు ఈ అమ్మాయినే చూపించాడు. ఫస్ట్‌ లుక్‌ లోనే అందరికి నచ్చేయడంతో.. ఇప్పుడు ఈ అమ్మాయి మిస్టరీ గర్ల్‌ అయ్యింది. పనిలో పనిగా రాత్రికిరాత్రి స్టార్‌ అయ్యింది.

ఆర్సీబీకి మద్దతుగా వచ్చిన ఆ యువతి మ్యాచ్ జరిగినంత సేపు గ్యాలరీలో తన తోటి ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. ఆర్సీబీకి మద్దతు ఇచ్చింది కాబట్టి కచ్చితంగా బెంగళూరునే ఉంటుంది అని ఫిక్స్‌ అయ్యిన నెటిజన్లు ఇప్పుడు ఈ పాపం కోసం బెంగళూరులో వెదుకులాట మొదలుపెట్టారు. ఫైనల్‌గా తేలింది ఏంటంటే.. ఈ పిల్ల పేరు దీపిక ఘోష్‌. అందం, చలాకీ తనం దండిగా ఉన్న ఈ పిల్ల ఇప్పుడు ఐపీఎల్‌ కే ఐకాన్‌ లా మారింది. సో.. రాబోయే రోజుల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌ ల కోసం యాంకరింగ్‌ చేసినా ఆశ్చర్యం లేదు.