Begin typing your search above and press return to search.
'టామ్ క్రూస్'ను కాదని ఆ మూవీ షారుఖ్ తో చేశారు.. తీరా ఫలితం చూస్తే??
By: Tupaki Desk | 22 May 2021 5:00 PM ISTసినీ ప్రపంచంలో ఎప్పుడు ఏ మార్పు జరుగుతుందో జరిగే వరకు చెప్పలేము. ఎందుకంటే ఓ సినిమా స్క్రిప్ట్ - ప్రొడక్షన్ పరంగా అన్నివిధాలా సిద్ధం అయినప్పటికి ఎక్కడో ఓ మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ మార్పులలో ఒక్కోసారి హీరో లేదా హీరోయిన్ మారిపోవచ్చు. ఒకరి ప్లేస్ లో మరో యాక్టర్ తో అడ్జెస్ట్ కావాల్సిన పరిస్థితి రావచ్చు. ఇలాంటివి లోకల్ ఇండస్ట్రీలో జరగడం మాములే. కానీ ఓ విదేశీ ఫేమస్ హీరోను బాలీవుడ్ సినిమాతో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాలనీ అనుకోవడం మాత్రం మాములు విషయం కాదు. ఎందుకంటే అలా మిస్ అయినటువంటి సినిమా ప్లాప్ అయ్యుంటే వేరేలా ఉండేది. కానీ 25ఏళ్ల కిందటే ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ఆ సినిమాకు సంబంధించిన పలు క్రేజీ విషయాలు ప్రేక్షకులకు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ రొమాంటిక్ సినిమాల్లో ఒకటైన 'దిల్వాలే దుల్హానియా లే జాయంగే' సినిమా. అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతోనే అప్ కమింగ్ యాక్టర్స్ గా ఉన్నటువంటి షారుఖ్ ఖాన్ - కాజోల్ ఒక్కసారిగా స్టార్స్ అయిపోయారు. అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ పెయిర్ గా పాపులర్ అయ్యారు కాజోల్ - షారుఖ్. అయితే ఆదిత్యచోప్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ లవ్ సినిమాని యష్ చోప్రా నిర్మించారు. అయితే 25సంవత్సరాల నుండి ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ గా నిలుస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
ఏంటంటే.. ఈ సూపర్ హిట్ సినిమాలో రాజ్ మల్హోత్రా అనే పాత్రలో నటించాడు షారుఖ్ ఖాన్. కానీ షారుఖ్ కంటే ముందు ఈ సినిమాలో హీరోగా హాలీవుడ్ హ్యాండ్సమ్ టామ్ క్రూస్ ను అనుకున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఆదిత్యచోప్రా తెలిపారు. అయితే అసలు ఏం జరిగింది అంటే.. మొదటగా దిల్వాలే స్క్రిప్ట్ ను ఇండో - అమెరికన్ లవ్ నేపథ్యంలో రాసుకున్నాడు దర్శకుడు. అమెరికా నుండి వచ్చిన ఓ కుర్రాడు ఇండియాలోని ఓ పంజాబీ అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే వెర్షన్ లో ఆదిత్య స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. ఆ స్క్రిప్ట్ తీసుకెళ్లి ప్రొడ్యూసర్ యష్ చోప్రాకు వినిపించగానే స్క్రిప్ట్ ఓకే కానీ హాలీవుడ్ హీరో అవసరం లేదని చెప్పాడట. ఆ తరువాత స్క్రిప్ట్ ఇండియా వరకే పరిమితమై షారుఖ్ ఖాన్ దగ్గరకు స్క్రిప్ట్ వెళ్ళింది. షారుఖ్ వెంటనే ఓకే చేయడం - కాజోల్ పెయిర్ కుదరడం సినిమా తీయడం ఇలా అన్ని చకచకా అయిపోయాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ హీరోయిన్ కాజోల్ కూడా ప్రస్తావించింది. మొత్తానికి డిడిఎల్జే ఆల్ టైం ఫేవరేట్ మూవీల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.
