Begin typing your search above and press return to search.
బండ్ల హీరోగా సినిమా అప్‌డేట్ వచ్చేసింది
By: Tupaki Desk | 5 Sept 2021 11:00 AM ISTబండ్ల గణేష్ కెరీర్ నటుడిగా ప్రారంభం అయ్యింది. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన బండ్ల గణేష్ కు అనూహ్యంగా నిర్మాతగా ప్రమోషన్ దక్కింది. స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ కొన్నాళ్ల పాటు సినిమా ల్లో నటించలేదు. అయితే ఈ మద్య కాలంలో నిర్మాతగా బండ్ల గణేష్ సినిమాలు చేయడం లేదు. ఆయన మళ్లీ నిర్మాతగా సినిమాలు చేస్తాడనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతగా సినిమాలు ఏమో కాని నటుడిగా సినిమాలను చేసేందుకు బండ్ల సిద్దం అయ్యాడు. ఇప్పటికే బండ్ల గణేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న పాత్రలో కనిపించి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల వచ్చిన క్రేజీ అంకుల్స్ లో కూడా ఈయన కనిపించాడు. ఇన్నాళ్లు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన బండ్ల గణేష్ ప్రథాన పాత్రలో నటించబోతున్నాడు.
బండ్ల గణేష్ హీరోగా ఓర్త సెరువు సైజు 7 అనే తమిళ సినిమా రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రీమేక్ గురించిన వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. స్వయంగా బండ్ల గణేష్ సినిమాలోని స్టిల్ ను రిలీజ్ చేశాడు. పోలీస్ ఆఫీసర్ ముందు కూర్చుని అమాయకంగా ఉన్న పాత్రలో బండ్ల గణేష్ కనిపిస్తున్నాడు. బండ్ల గణేష్ ఈ సినిమా లో తన నటన విశ్వరూపంను చూపించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత బండ్ల గణేష్ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకు పోతాడేమో అంటూ కొందరు ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓర్త సెరువు సైజు 7 సినిమాను హిందీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ తనయుడు అయిన అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తున్నాడు. అక్కడ అభిషేక్ బచ్చన్ చేస్తున్న సినిమాను ఇక్కడ బండ్ల గణేష్ చేయడం మరింత ఆసక్తిని పెంచుతుంది. జాతీయ అవార్డును దక్కించుకున్న సినిమా అవ్వడం వల్ల నటన పరంగా చాలా ఎమోషన్స్ పలికించాల్సి రావచ్చు. మరి బండ్ల గణేష్ కమెడియన్ గా మాత్రమే ఇన్నాళ్లు చూశాం. మరి ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా బండ్ల గణేష్ ఈ సినిమాను చేస్తాడనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చాలా స్పీడ్ గా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా బండ్ల గణేష్ పేర్కొన్నాడు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేస్తారా అంటూ పలువురు బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తున్నారు.