Begin typing your search above and press return to search.
ఈ ఏడాదిలో అత్యంత లక్కీ హీరోయిన్
By: Tupaki Desk | 13 Dec 2020 10:11 AM ISTహీరోయిన్ లు నిలదొక్కుకోవడం కొన్ని సార్లు చాలా కష్టం అవుతుంది. సూపర్ హిట్ వచ్చినా కూడా కొందరు హీరోయిన్స్ ను జనాలు పట్టించుకోరు. కొందరు హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్లి పోతూ ఉంటారు. కాని కొందరు హీరోయిన్స్ మాత్రం మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుని స్టార్ గా మారిపోతారు. అయితే ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా స్టార్ హీరోయిన్ అయిన వారు ఎవరు లేరు. కాని ఈ ఏడాది కృతి శెట్టి ఆ రికార్డును దక్కించుకుంది. తెలుగులో ఈమె చేసిన ఉప్పెన సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినా కూడా మూడు సినిమాలను దక్కించుకుంది. మరో మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.
2020 సంవత్సరం ఎంతో మందికి విషాదాన్ని.. దురదృష్టాన్ని మిగిల్చింది. కాని ఈ ఏడాది మాత్రం కృతి శెట్టికి అత్యంత లక్కీగా చెప్పుకోవచ్చు. ఆమె ఉప్పెన సినిమా విడుదల కాకుండానే మంచి గుర్తింపు దక్కించుకుంది. వరుసగా ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ నుండి కూడా ఈమెకు ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందబోతున్న ప్రతిష్టాత్మక మూవీ లో కృతి శెట్టికి ఆఫర్ దక్కిందట.
తమిళ సూపర్ స్టార్ అయిన సూర్యకు జోడీగా నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ అమ్మడు ఒక్క సినిమాతో ఇన్ని ఆఫర్లు దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటూ ఉంటే... ఇతర హీరోయిన్స్ మాత్రం కుళ్లుకుంటూ ఉన్నారు.