Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే కిరాతక హత్య.. నటి వక్షాలు కోసి.. పేగులు చీల్చి.. వీడని మిస్టరీ!

By:  Tupaki Desk   |   24 Sept 2020 5:00 AM IST
ప్రపంచంలోనే కిరాతక హత్య.. నటి వక్షాలు కోసి.. పేగులు చీల్చి.. వీడని మిస్టరీ!
X
బహుశా ప్రపంచంలోనే ఇదో అతి కిరాతకమైన హత్యగా చెప్పవచ్చు. నిజానికి ఆ హంతకుడు ఎంతటి నరరూప రాక్షసుడో .. అంత కళా హృదయం కలవాడు. ఓ యువనటిని చిత్రవద చేసి, చంపేశాడు. ఆమె దేహాన్ని ఎంతో కళాత్మకంగా ముక్కలు చేశాడు. మృతదేహంపై ఒక్క నెత్తుటిచుక్కకూడా కనిపించకుండా శుభ్రపరిచి .. ఆ నటిమణి రొమ్ములు కోసి.. పేగులను కూడా కోసి అందంగా ఈ మృత దేహానికి అలంకరించాడు. ఈ తరహా హత్య ప్రపంచంలోనే ఇంతవరకు మరెక్కడా జరగలేదు. అయితే ఈ కేసును మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఛేదించ లేకపోయారు. ఈ దారుణమైన వికృతకాండ ఏ దేశంలో జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

అది అమెరికా దేశంలోని లాస్​ ఎంజిల్స్​ నగరం .. ఆ రోజు 1947, జనవరి 15.. అప్పడప్పుడే తెల్లవారుతోంది.. బెట్టీ బెర్సింగర్​ అనే మహిళ తన మూడేళ్ల కూతురు అన్నే తో కలిసి ఓ షాప్​కు వెళ్తున్నది. అయితే మార్గమధ్యంలో చూసిన దృశ్యం ఆమెను షాక్​కు గురిచేసింది. ఇంతకు అక్కడ ఆమె ఏం చూసిందంటే.. ఓ మృతదేహం, చాలా భయానక స్థితిలో ఉన్న శవాన్ని ఆమె చూసింది. ఎవరో ఆ శావాన్ని రెండుముక్కలు చేసి అక్కడ పడేశారు. ఓ రొమ్మును పూర్తిగా కోసేశారు. ముఖంతోపాటు శరీరమంతా కత్తితో కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే అక్కడ ఒక్క రక్తం చుక్కకూడా లేదు. ముఖం నవ్వుతున్నట్టు కనిపించేందుకు చెవుల నుంచి నోరు వరకు హంతకుడు కత్తితో కోశాడు. ఆమె కడుపులోని పేగులను మొత్తం తీసేసి కడుపు భాగాన్ని కూడా శుభ్రపరిచాడు. ఈ పరిస్థితిలో ఉన్న శవాన్ని చూసి బెట్టీ బెర్సింగర్​ పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులకు ఆ మృతదేహం అమెరికాకు చెందిన ప్రముఖ నటి ‘బ్లాక్​ డహ్లియా’ పేరుతో పాపులర్​ అయిన ఎలిజబెత్​ షార్ట్​ (22) అనే నటిదని తేలింది. ఆమెను ఎవరు చంపారు? ఆమెకు ఎవరితో శతృత్వం ఉంది.. అసలు ఈ స్థాయిలో చిత్రవద చేయడానికి కారణాలు ఏమిటని పోలీసులు పరిశోధన మొదలు పెట్టారు. ఈ వార్త ఒక్క అమెరికాలోనే కాక.. యావత్​ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అప్పటినుంచి ‘బ్లాక్​ డాహ్లియా మర్డర్​ మిస్టరీ’ కొనసాగుతూనే ఉంది..

500 మంది అనుమానితులు

పోలీసులు ఈ కేసులో మొత్తం 500 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. కానీ హంతకుడు ఎవరన్నది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. 1934 నుంచి 1938 వరకు 12 మందిని దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ డెజావూ ఈ హత్యలు చేసి ఉంటాడని పలువురు అనుమానించారు. అప్పట్లో డెజావూనే హంతకుడు అయ్యి ఉంటాడని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే అందుకు సాక్ష్యాధారాలు మాత్రం దొరకలేదు.

బాయ్​ఫ్రెండ్​ పై పోలీసులకు డౌట్​

నటి ఎలిజబెత్​.. రాబర్ట్ రెడ్ మాన్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపేది.. వీరిద్దరూ 947, జనవరి 9న లాస్ ఏంజిల్స్‌లోని డౌన్‌టౌన్‌లో గల బిల్ట్‌మోర్ హోటల్‌లో గడిపారు. అయితే ఆ తర్వాత నుంచి ఎలిజబెత్​ తనతో కాంటాక్ట్​ లో లేదని మాన్లే తెలిపాడు. ఇతడిపై పోలీసులకు అనుమానం ఉన్నప్పటికీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జనవరి 9న అదృశ్యమైన ఎలిజబెత్ జనవరి 15, ఉదయం 10 గంటలకు శవమై కనిపించింది. అప్పటికే ఆమె చనిపోయి సుమారు 10 గంటలు అయ్యింది. ఘటనా స్థలంలో డిటెక్టీవ్‌లకు ఒక కాలి మడమ ముద్ర దొరికింది. దానికి కొద్ది దూరంలో కారు టైరు ట్రాక్‌లు కనిపించాయి. హంతకుడు ఆమెను తలపైన బలంగా కొట్టడం వల్ల అంతర్గతం రక్తస్రావమై చనిపోయినట్లు శవ పంచనామాలో తేలింది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానంతో వీర్య కణాల కోసం అన్వేషించిన ఫలితం దక్కలేదు. పదునైన ఆయుధంతో హంతకుడు ఆమెను రెండు ముక్కలు చేశాడని, హత్యకు ముందు ఆమెను చిత్రహింసలకు గురిచేశాడని తెలిపారు. ఎలిజబెత్​ శవం దొరికిన నెలరోజులకే ఇదే తరహాలో జీన్నే అనే మరో యువతి శవం దొరికింది. అయితే ఈ సారి హంతకుడు శవాన్ని రెండు ముక్కలు చేయలేదు. ఆమె పొట్టలోకి లిప్​స్టిక్​ను జొప్పించాడు. అందులో ‘ఫక్​యూ బీడీ’ అని రాసి ఉంది. అయితే బీడీ అంటే ‘బ్లాక్​ డాహ్లియా అని కావచ్చని కొందరి అభిప్రాయం. ఈ శవల మిస్టరీ అలాగే మిగిలిపోయింది.


హంతకుడు మా తండ్రే..

స్టీవ్​ అనే ఓ రచయిత 2003లో ‘బ్లాక్ డహ్లియా అవేంజర్: ది ట్రూ స్టోరీ’ అనే పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకంలో ఎలిజబెత్​న చంపింది మా తండ్రే అంటూ అతడు ఆ పుస్తకం లో రాశాడు. అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను బయట పెట్టాడు. ఇంతకీ స్టీవ్​ ఏమంటాడంటే.. ‘1940లో మా నాన్నజార్జ్ హాడెల్ లాస్​ ఏంజెల్స్​లో ఓ క్లినిక్​ను నడిపేవాడు. అందులో సుఖవ్యాధులకు సంబంధించిన వైద్యం చేసేవాడు. మానాన్నే ఆ నటిని చంపాడు. అయితే పోలీసుల ప్రధాన అనుమానితుల్లో హాడెల్​ కూడా ఉన్నాడు. మరో వైపు 1999లో ఈ డాక్టర్​ చనిపోయాడు. హంతకుడు పోలీసులకు రాసిన లేఖల్లో ఉన్న రాత తన తండ్రిదే. ఆ నటి క్లినికల్​ గాయాలు కూడా అందుకు నిదర్శనం’ అంటూ స్టీవ్​ చెప్పాడు. అయితే స్టీవ్​ వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. అతడు కేవలం పుస్తకాలను సేల్​ చేసుకోవడానికే ఇటువంటి పుకార్లు పుట్టించాడని చెప్పారు. ఏది ఏమైనా ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ ఇంతవరకు వీడలేదు.