Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్ట‌ర్ ని సస్పెన్స్ లో ఉంచిన మెగాస్టార్

By:  Tupaki Desk   |   31 Oct 2020 8:30 AM IST
మాస్ డైరెక్ట‌ర్ ని సస్పెన్స్ లో ఉంచిన మెగాస్టార్
X
60 ప్ల‌స్ లో మెగాస్టార్ చిరంజీవి స్పీడే వేరుగా ఉంది. టైమ్ తో సంబంధం లేకుండా స్పీడు పెంచేస్తున్నారు. ప్ర‌స్తుతం స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌‌క‌త్వంలో న‌టిస్తున్న `ఆచార్య‌` త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్టులు ఫైన‌ల్ చేసేస్తుండ‌డం హీట్ పెంచుతోంది.

ఇప్ప‌టికే ఆచార్య‌ 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా తాజా షెడ్యూల్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. న‌వంబ‌ర్ సెకండ్ లేదా థ‌ర్ట్ వీక్ లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు చిరు మ‌రో రెండు చిత్రాల్ని లైన్ ‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. త‌మిళ హిట్ ఫిల్మ్ `వేదాలం` ఆధారంగా మెహెర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌బోతున్నారు. ఏకే ఎంట‌ర్ ‌టైన్ ‌మెంట్స్ అధినేత అనిల్ సుంక‌ర ఇప్ప‌టికే ఏర్పాట్లు మొద‌లుపెట్టారు. మల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌`ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రీమేక్ చేస్తున్నా విష‌యం తెలిసిందే.

ఈ రెండింటితో పాటు మ‌రో చిత్రాన్ని కూడా చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇది మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ ‌గా వుంటుంద‌ని దీనికి త్రివిక్ర‌మ్‌,.. లేదా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వుంద‌ని తాజా టాక్‌. వీరిద్ద‌రితో క‌లిసి ప‌ని చేయాల‌ని గ‌త‌కొంత కాలంగా చిరు ఎదురుచూస్తున్నారు. అది వ‌చ్చే ఏడాది కార్య‌రూపం దాల్చే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. చిరు స్పీడు చూసిన వాళ్లంతా ఏంటీ ఇంత స్పీడుగా వున్నార‌ని ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు.