Begin typing your search above and press return to search.
ది మ్యాట్రిక్స్ 4 ట్రైలర్: మైండ్ బ్లోయింగ్ విజువల్ ప్రపంచంలోకి పయనం!
By: Tupaki Desk | 10 Sept 2021 11:37 AM ISTహాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ ది మ్యాట్రిక్స్ నుంచి ఇప్పటికే మూడు భాగాలు రిలీజై సంచలన విజయాలు సాధించాయి. భారీ యాక్షన్ విన్యాసాలతో గగుర్పొడిచే సాహసాలు స్టైల్ కంటెంట్ తో మ్యాట్రిక్స్ ఫ్రాంఛైజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అద్భుత విజువల్ ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సిరీస్ నుంచి నాలుగో భాగం మ్యాట్రిక్స్ రిసరక్షన్స్ (మ్యాట్రిక్స్ 4) రిలీజ్ కి సిద్ధమవుతోంది. క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా మ్యాట్రిక్స్ 4 మొదటి ట్రైలర్ విడుదలైంది. మ్యాట్రిక్స్ పునరుత్థానాలు ఏ విధంగా సాగాయి? అన్నదే ఈ ట్రైలర్ సారాంశం.. గతం నుంచి వర్తమానానికి వచ్చేందుకు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు నాయకానాయికలు చేసే ప్రయత్నాలు ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. కీను రీవ్స్ నియో పాత్రను కొనసాగించారు. తన గతంలోని సంఘటనలను గుర్తుచేసుకోవడానికి ఎర్రని మాత్ర(క్యాప్సుల్)ను సేవించడం ఇందులో ప్రధాన హైలైట్. సంచలనాల భారతీయ నటి ప్రియాంక చోప్రా ది మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో తొలిసారిగా కనిపించడంతో అభిమానులకు ఇది గొప్ప ట్రీట్ గా నిలవనుంది. పీసీ క్షణకాలం ట్రైలర్ లో మెరుపులా మెరిసింది. తన ముఖంలో వ్యంగ్యమైన చిరునవ్వుతో కనిపించింది. క్లాసిక్ అనిపించే ఐ- గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.
కీను రీవ్స్ -థామస్ ఆండర్సన్ -క్యారీ -అన్నే మోస్ ట్రినిటీ పాత్రలన్నీ మెషీన్స్ (యంత్రాల)తో నియంత్రించబడే ప్రపంచంలో జీవిస్తారు. ఈ ప్రపంచంలో వాస్తవికతకు ఫాంటసీకి ఫిక్షన్ కు మధ్య సంబంధం ఏమిటి? అన్నది మేధావులకు మాత్రమే అందే వింత. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. కళ్లు చెదిరే విన్యాసాలతో అద్భుతాలతో ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. ఈ ఏడాది అత్యంత భారీ విజువల్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో అద్భుత ట్రీట్ ని ఇచ్చే చిత్రంగా భావించాలి.
ఒకానొక సమయంలో ఆండర్సన్ అకా నియో తన గతాన్ని గుర్తుంచుకోవడంలో విఫలమవుతాడు. దీని కోసం నీల్ పాట్రిక్ హారిస్ పోషించిన తన థెరపిస్ట్ నుండి సమాధానాలు కోరుతాడు. ట్రైలర్ అప్పుడు కొత్త క్యారెక్టర్ పై దృష్టి పెడుతుంది. ప్రియాంక చోప్రా జోనాస్ భారీ కళ్లజోడు ధరించి కనిపిస్తుంది. ఆమె ముఖం మీద ఒక రూపం ఎలివేట్ అయ్యింది. దాని నుండి ఆమె పాత్రలో కొన్నిటికి సమాధానాలు లేవని తెలుస్తుంది.
ట్రైలర్ ఆధారంగా రీవ్స్ తన గతాన్ని పూర్తిగా గుర్తు చేసుకోలేదని అర్థమవుతుంది. ``నేను కలలో మాత్రమే కాదు కలలు కన్నాను`` అని అయోమయంలో నియో నీల్ పాట్రిక్ హారిస్ తో ఒప్పుకుంటాడు. అప్పుడు అతను తరచూ కలలు కంటున్నందుకు తనకు `పిచ్చి పట్టిందా?` అని అడుగుతాడు. ఇద్దరూ ఇంతకు ముందు ఒకరినొకరు కలుసుకున్నారో లేదో గుర్తులేకపోవడం ఆసక్తికర ఎలిమెంట్. ఇందులో సీన్ క్యారీ-అన్నే మోస్ తో సమావేశమైన రీవ్స్ మధ్య సన్నివేశాలు రక్తి కట్టిస్తాయి.
మ్యాట్రిక్స్ పునరుత్థానాలలో నియో పాత్రలో కీను రీవ్స్.. ట్రినిటీగా క్యారీ-అన్నే మోస్,.. నియోబ్ గా జాడా పింకెట్ స్మిత్ కనిపిస్తారు. ఫ్రాంఛైజీలో ప్రియాంక చోప్రా జోనాస్,- యహ్యా అబ్దుల్ మతీన్ II,- నీల్ పాట్రిక్ హారిస్, -జోనాథన్ గ్రాఫ్, - క్రిస్టినా రిక్కీ- జెస్సికా హెన్విక్ తదితరులు కొత్తగా చేరారు.