Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్: `స్టార్ వార్స్: ది మండ‌లోరియ‌న్`

By:  Tupaki Desk   |   26 Aug 2019 2:31 PM IST
ట్రైల‌ర్: `స్టార్ వార్స్: ది మండ‌లోరియ‌న్`
X
మార్వ‌ల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్.. దాని అనుబంధ సంస్థ డిస్నీ నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల్ని అల‌రించే అద్భుత‌మైన విజువ‌ల్స్ తో అత్యంత భారీ త‌నంతో యానిమేటెడ్ ఫిక్ష‌న్ సినిమాల్ని తెర‌కెక్కించ‌డం ఈ యూనివ‌ర్శ్ ప్ర‌త్యేక‌త‌. ఇప్ప‌టికే ఎన్నో సూప‌ర్ హీరో సినిమాల్ని .. కామిక్ బుక్ ఫిక్ష‌న్ పాత్ర‌ల్ని ఎంతో అద్భుతంగా విజువ‌లైజ్ చేసి డిస్నీ సంస్థ అందించింది.

తాజాగా డీ23 క‌న్వెన్ష‌న్‌ పేరుతో `వాల్ట్ డిన్సీ కంపెనీ` భ‌విష్య‌త్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్న సినిమాల ఎక్స్ పోని ప్రారంభించింది. ఈ ఎక్స్ పోలో రిలీజ్ చేసిన తాజా ట్రైల‌ర్ `స్టార్ వార్స్: ది మండ‌లోరియ‌న్` జెట్ స్పీడ్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. స్టార్ వార్స్ సిరీస్ నుంచి వ‌స్తున్న స‌రికొత్త చిత్ర‌మిది. వారియ‌ర్ ఎమ‌ర్జెన్సీ కాన్సెప్టుతో రూపొందిస్తున్న ఈ సినిమా విజువ‌ల్స్ మ‌రో కొత్త వార్ జోన్ లోకి తీసుకెళుతున్న అనుభూతిని క‌లిగిస్తున్నాయి. ఆకాశంలో జెట్ ఫైట‌ర్స్ నిశీధిని చీల్చుకుంటూ వార్ జోన్ లోకి ప్ర‌వేశిస్తున్న విజువ‌ల్స్ .. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్ అని చెప్పొచ్చు. స్టార్ వార్స్ సిరీస్ లో జంగో - బోబా ఫెట్ వంటి క‌థ‌ల త‌ర్వాత ప్ర‌త్యేకించి `ది మండ‌లోరియ‌న్` క‌థ‌ను ఎంపిక చేసుకుని సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. జాన్ ఫావ్రూ- టైకా వైటిటీ, బ్రైస్ డ‌ల్లాస్ హోవార్డ్- రిక్ ఫ‌ముయివా- డెబొరా చౌ వంటి టాప్ డైరెక్ట‌ర్స్ సార‌థ్యంలో ఈ సినిమాని విజువ‌లైజ్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఇక ఈ ద‌ర్శ‌కులంతా ఈ సిరీస్ లో ప‌లు సినిమాల‌కు ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న‌వాళ్లు. తాజా చిత్రం కోసం అత్యంత భారీ ఖ‌ర్చుతో లుకాస్ ఫిలిమ్ ప్ర‌త్యేకించి ఓ స‌రికొత్త సామ్రాజ్యాన్ని వారియ‌ర్ వ‌ర‌ల్డ్ ని క్రియేట్ చేసింది.

స్టార్ వార్స్ సిరీస్ కి ఇప్ప‌టికే ప్ర‌త్యేకించి వీరాభిమానులు ఉన్నారు. ఈ సిరీస్ సినిమా అన‌గానే అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంటుంది. తాజా ట్రైల‌ర్ చూశాక ఇంకా ఆస‌క్తి పెరిగింది. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ సినిమా స‌రికొత్త అనుభూతిని ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు.