Begin typing your search above and press return to search.
'ది లూప్' ట్రైలర్: శింబు నటించిన టైమ్ లూప్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్..
By: Tupaki Desk | 2 Oct 2021 2:05 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో శింబు - కళ్యాణీ ప్రియదర్శన్ జంటగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ''మానాడు''. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ మూవీని 'రీవైండ్' అనే పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు గతేడాది ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను ''ది లూప్'' అని మార్చారు.
''ది లూప్'' చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు గాంధీ జయంతిని పురస్కరించుకుని సినిమా ట్రైలర్ ను వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు. తమిళంలో దర్శకుడు మురగదాస్ - కన్నడ లో హీరో రక్షిత్ శెట్టి - మలయాళంలో హీరో నివీన్ పౌలీ ఈ చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసారు.
ట్రైలర్ విషయానికొస్తే.. ఇది టైమ్ లూప్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ లతో థ్రిల్ కి గురి చేస్తూ సాగిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇందులో శింబు ముస్లిం యువకుడిగా కనిపిస్తుండగా.. అతని ప్రేయసిగా కళ్యాణీ నటించింది. శింబు ఓ ముఖ్యమంత్రి ని చంపే ఘటన రిపీట్ గా జరుగుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఆపడానికి ట్రై చేసే పోలీస్ ఆఫీసర్ గా ఎస్.జె సూర్య కనిపిస్తున్నారు.
శింబు - ఎస్.జె సూర్య ఇద్దరూ తమ జీవితాల్లో ఈ టైం లూప్ జరుగుతున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ముఖ్యమంత్రి ని ఎలా కాపాడతారు?, అసలు సీఎం ని శింబు ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? టైం లూప్ నుంచి వీరు బయటపడ్డారా లేదా? అనేది ''ది లూప్'' కథాంశంగా తెలుస్తోంది. దీనికి విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఇందులో శింబు - ఎస్.జె సూర్య పాత్రలు హైలైట్ గా నిలిచాయి. శింబు మునుపటి కంటే చాలా బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు.
టైమ్ లూప్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో అనేక చిత్రాలు రూపొందగా.. ''ది లూప్'' ని మాత్రం ఒక పొలిటికల్ యాక్టన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దడం గమనార్హం. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో ఇటీవల 'ఆహా' లో 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ ప్రభు.. మరో వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నాడని అర్థం అవుతోంది.
''ది లూప్'' చిత్రంలో దర్శకుడు భారతీరాజా - ఎస్.ఏ.చంద్రశేఖర్ - ప్రేమ్ జీ - కరుణాకరన్ - మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉమేష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ చేస్తున్న 100వ సినిమా ఇది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్ కామాచి సుమారు 125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో తన చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న శింబు.. 'ది లూప్' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.