Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : మాల్దీవ్స్ చీకటిలో జాన్వీ అందాల వెలుగులు

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:15 AM GMT
ఫొటోటాక్ : మాల్దీవ్స్ చీకటిలో జాన్వీ అందాల వెలుగులు
X
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ సినిమాలతో కంటే కూడా ఫొటో షూట్స్ తో ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. బాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న జాన్వీ కి ఇప్పటి వరకు కమర్షియల్‌ గా ఏ ఒక్క సినిమా తో కూడా సక్సెస్ దక్కలేదు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కు వస్తున్న గుర్తింపు కంటే కూడా ఫొటో షూట్స్ తోనే ఎక్కువ అనడంలో సందేహం లేదు.

తాజాగా జాన్వీ కపూర్‌ మాల్దీవ్స్ లో హాలీడేస్‌ ను ఎంజాయ్ చేస్తోంది. స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి అక్కడ విహార యాత్రలో ఉన్న ఈ అమ్మడు అక్కడ నుండి ఫొటో షూట్స్ తో అందాలు ఆరబోసి తన అభిమానులకు షేర్‌ చేస్తూనే ఉంది.. ఎప్పటిలాగే తన ఫొటోలతో వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా జాన్వీ షేర్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ అందాల ఆరబోత కు మాల్దీవ్స్ లో ఉన్న చిమ్మ చీకటిలో కూడా వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా అందంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మినీ షార్ట్‌ వేసుకుని నడుము నాభి అందాలను చూపిస్తూ పర్పుల్ కలర్ టాప్‌ ధరించిన జాన్వీ కపూర్‌ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

జాన్వీ కపూర్‌ ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యింది. హిందీ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ లో మాత్రమే నటిస్తూ ఉన్న ఈ అమ్మడు సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పిందట.

ముందు ముందు టాలీవుడ్‌ లో జాన్వీ కపూర్‌ చాలా సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ నటించే అవకాశం ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ రామ్‌ చరణ్ సినిమాకు జాన్వీ ముందు కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.