Begin typing your search above and press return to search.

సలార్ టీమ్ ని ఆందోళనలో పడేస్తున్న లీకులు..!

By:  Tupaki Desk   |   10 Nov 2022 5:30 PM GMT
సలార్ టీమ్ ని ఆందోళనలో పడేస్తున్న లీకులు..!
X
కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లతో మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. కె.జి.ఎఫ్ నిర్మాతలు తెరకెక్కిస్తున్న ఈ మూవీ పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టామినాకు తగ్గ కథ పడలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో జస్ట్ ఓకే అనిపించినా రాధేశ్యామ్ మాత్రం పూర్తిగా నిరాశపరచింది. సలార్ మీదే ప్రభాస్ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న సలార్ సినిమా నుంచి లీకుల బెడద ఎక్కువైంది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఈ లీక్స్ జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్ గా సలార్ నుంచి మరో లీక్డ్ వీడియో బయటకు వచ్చింది. సినిమాలో ప్రభాస్ మాస్ లుక్ తో కనిపిస్తున్నారు. షూట్ గ్యాప్ లో ప్రభాస్ కూర్చుని ఉన్నప్పుడు ఈ వీడియో తీశారు. సలార్ లో ప్రభాస్ గుబురు గెడ్డంతో మాస్ లుక్ తో కనిపించనున్నారు. భారీ అంచనాలతో వస్తున్న సలార్ సినిమా నుంచి ఈ లీకులు చిత్రయూనిట్ ని ఆందోళనలో పడేస్తున్నాయి. సినిమా సెట్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఎక్కడో ఒక చోట నుంచి ఈ లీక్స్ వస్తున్నాయి. కె.జి.ఎఫ్ లో గోల్డ్ మైనింగ్ గురించి ప్రస్థావించిన ప్రశాంత్ నీల్ ఈసారి సలార్ సినిమాలో నల్ల బంగారం కోల్ మైన్ గురించి డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మొదట ఒక పార్ట్ గానే అనుకున్న సలార్ సినిమాని ఇప్పుడు రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అసలైతే ఈ ఇయర్ లోనే సలార్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా కె.జి.ఎఫ్ 2 రిలీజ్ ఉండటంతో ఈ ఇయర్ రిలీజ్ చేయలేదు. ఇక మరోపక్క ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఎక్కువ డేట్స్ ఇవ్వడం వల్ల సలార్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడు. అందుకే సలార్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

ప్రభాస్ సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కె.జి.ఎఫ్ కి పనిచేసిన టెక్నికల్ టీమే ఈ మూవీకి పనిచేస్తున్నారు. తప్పకుండా సలార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటునని అంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ మాస్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. ఆ రోజు కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.