Begin typing your search above and press return to search.

ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్..!

By:  Tupaki Desk   |   12 July 2022 3:38 PM GMT
ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్..!
X
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''విక్రమ్''. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఫహాద్ ఫాజిల్ - విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించగా.. సూర్య అతిథి పాత్రలో మెరిసారు.

హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ఏరియాలోనూ మంచి వసూళ్లు సాధించి.. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యాజమాన్యాలకు లాభాలు తెచ్చిపెట్టింది.

'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ నిలిచిన ఈ మూవీ.. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. కమల్ హాసన్ స్టామినా ఏంటో ఈ సినిమా తిరిగి నిరూపించింది.

ఇకపోతే 'విక్రమ్' సినిమా జులై 8న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ వీకెండ్ ఓపెనింగ్ వ్యూయర్ షిప్ సాధించి.. ఓటీటీలో రికార్డ్ సృష్టించింది.

డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు కన్నడ, మలయాళ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. స్ట్రీమింగ్ కాబడిన ఐదు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. రికార్డ్ స్థాయి వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'విక్రమ్' చిత్రంతో ప్రేక్షకులు అందించిన అపూర్వ విజయం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రతి ఇంటికీ ఈ సినిమా చేరింది. దేశవ్యాప్తంగా ఐదు భాషల్లోనూ హయ్యెస్ట్ వీకెండ్ వ్యూయర్ షిప్ సాధించడం ఆనందంగా ఉంది. మా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాట్స్ అని అన్నారు.

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కంటెంట్ హెడ్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. మా ఓటీటీలో 'విక్రమ్' సాధిస్తున్న రికార్డ్ నెంబర్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్ షిప్ లో రికార్డులు క్రియేట్ చేస్తోందీ సినిమా. దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీక్ ను అందించింది. ఇంత గొప్ప సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం ఆనందంగా ఉంది. కమల్ హాసన్ స్టార్డమ్ ను విక్రమ్ మరోసారి ప్రూవ్ చేసింది అని అన్నారు.