Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: తమ్ముడి రాకతో మెగా బ్రదర్ పరవశం
By: Tupaki Desk | 9 Dec 2020 9:43 AM ISTమెగా డాటర్.. నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక.. జొన్నలగడ్డ చైతన్యల వెడ్డిండ్ కార్యక్రమం ఉదయపూర్ లో ప్రారంభమైంది. ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ.. జొన్నలగడ్డ ఫ్యామిలీ ఉదయ్ పూర్ చేసుకున్నాయి. అయితే పవన్ స్టార్ పవన్‌కల్యాణ్ అప్పటికీ ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో ఎంగేజ్ మెంట్ కి హాజరు కానట్టే పెళ్లికి కూడా పవన్ వెళ్లడం లేదంటూ ఒక సెక్షేన్ లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఓవైపు రైతుల కోసం నిరసన ధీక్ష అంటూ బిజీగా ఉన్న పవన్ వస్తారా రారా? అన్న డైలమా కనిపించింది.
అయితే అన్ని పుకార్లకు చెక్ పెడుతూ పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లారు. బేగం పేట్ ఏయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తన ఫ్యామిలీతో కలిసి పవన్ ఉదయ్ పూర్ వెళ్లారు. దీంతో పవన్ నిహారిక పెళ్లిలో పాల్గొనకపోవచ్చనే ఊహాగానాలకు తెరపడింది. మామూలుగా అయితే ఫ్యామిలీ ఫంక్షన్ లకు పవన్ ఈ మధ్య దూరంగా వుంటూ వస్తున్నారు. ఆగస్టులో జరిగిన నిహారిక ఎంగేజ్ మెంట్ కి కూడా హాజరు కాలేదు. దీంతో పెళ్లికి ఆయన హాజరు కావడం కష్టమనే వాదన వినిపించింది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తను పెళ్లికి హాజరవుతానని నిహారికాకు వాగ్దానం చేసినట్లు తెలిసింది. చెప్పినట్టుగానే ఆయన వెళ్లారు. మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమానికి పవన్ హాజరు కాలేకపోయినా మెహెందీ వేడుకలకు హాజరయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు.
వివాహ వేడుక జరుగుతున్న ఉదయ్ విలాస్ కి పవన్ రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందాన్ని వ్యక్తం చేసింది. నాగబాబు సోషల్ మీడియాలో ఇలా స్పందించారు. `ఈ క్షణం పూర్తి కావడానికి చివరి ఆనందం కూడా వచ్చింది` అని తమ్ముడిపై తనకున్న ప్రేమని చాటుకున్నారు. తన తమ్ముడి రాకతో ఆనందంతో నాగబాబు పరవశించిపోయారు.