Begin typing your search above and press return to search.

ముద్దు సీన్ కు ఒప్పుకుంటే అలా ముద్దాడేశాడట

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:29 AM GMT
ముద్దు సీన్ కు ఒప్పుకుంటే అలా ముద్దాడేశాడట
X
ఆమెకు హీరోయిన్ గా తొలి సినిమా. ఆ హీరో కు తొలి సినిమానే. సీన్ లో భాగంగా హీరో.. హీరోయిన్ల మధ్య కిస్ సీన్ జరగాలి. అందుకు హీరో.. హీరోయిన్లు ఇద్దరు ఓకే చెప్పారు. షూట్ స్టార్ట్ అయ్యింది. కట్ చెప్పారో లేదో.. ఆ హీరోయిన్ పిచ్చ కోపం తో దర్శకుడి వద్దకు చెడామడా తిట్టేసిన వైనం బయటకు వచ్చింది. కిస్ సీన్ అంటే ఓకే అన్నాను కానీ.. ఇలాంటి కిస్ సీన్ ఏమిటంటూ క్వశ్చన్ చేసిన వైనం తో దర్శకుడు బుర్ర గోక్కునే పరిస్థితి. ఇంతకీ ఆ సినిమా షూట్ ఏమిటి? ఎవరా హీరోయిన్? అమ్మడికి అంతలా ఇరిటేట్ చేసిన హీరో ఎవరు? సరిగ్గా సినిమా విడుదలకు కాస్త ముందుగా ఈ ముద్దు లొల్లి తెర మీదకు ఎందుకు వచ్చింది? అన్న విషయాల్లోకి వెళితే..

హీరోయిన్ హిరోషిణి అన్నంతనే.. ఎవరీ భామ అన్న క్వశ్చన్ రావటం ఖాయం. అలా కాకుండా కోమలి సిస్టర్స్ గుర్తున్నారా? అన్నంతనే..అద్భుతం గా మిమిక్రీ చేసే ఆ ఇద్దరు చిన్న అమ్మాయిలు గుర్తుకు వచ్చేస్తారు. ఆ సిస్టర్స్ లో ఒకరే హిరోషిణి. మన మనసుల్లో చిన్నపిల్లలు గా నిలిచి పోయినా.. కాలంతో పాటు పెరిగి.. వారిప్పుడు యుక్త వయసులోకి అడుగు పెట్టేశారు. వయసు తో వచ్చిన మార్పుల తో హీరోయిన్ గా ఆమెకు ఒక కన్నడ సినిమా లో అవకాశం వచ్చింది.

1994లో మద్రాస్ లో జరిగిన ఒక రియల్ ఉదంతాన్ని తీసుకొని రీల్ స్టోరీగా మలుస్తున్నారు. ఒక స్క్రూ ఒక యువకుడి జీవితాన్ని ఎలా మార్చిందన్న కథాంశంతో తీసిన ఈ సినిమా పేరు ఉట్రాన్. హీరోగా రోషన్ అనే కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నారు. పలు యాడ్స్ చేసిన అతగాడికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఇలాంటి వేళ.. తనకుషూటింగ్ లో ఎదురైన అనుభవం గురించి ఫైర్ అవుతోంది హిరోషిణి.

రాజా గజనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముద్దు సీన్ షూట్ చేసే సమయంలో.. హీరో ముద్దుకు బదులుగా.. కాస్త అడ్వాన్స్ అయిన పెదాల లోపలకు జొరబడి.. నాలుకను చప్పరించేయటాన్ని ఆమె ప్రశ్నిస్తోంది. తనకు కథ చెప్పిన సమయంలో లిప్ లాక్ ఉంటుందే చెప్పారని.. అందుకు తాను ఓకే చెప్పానని.. కానీ హీరో స్మూచ్ చేయటం ఏమిటని మండి పడుతోంది. అయితే.. ముద్దులో ఉండే రకాల విషయంలో దర్శకుడు అయోమయంలో ఉండటంతో.. ముద్దుకు.. స్మూచ్ కు తేడాను వివరించి.. ఇదేం పద్దతని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. తొలిసారి జరిగినట్లు కాకుండా రెండోసారి సరిగా చేస్తానని చెప్పిన హీరో.. రెండోసారి సైతం ముద్దుకు బదులుగా స్మూచ్ చేయటంతో తీవ్ర ఆగ్రహం తో షూట్ లోకి వెళ్లకుండా తనకు కేటాయించిన కారవాన్ లో ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ వివాదం బయటకు రావటం వెనుక.. సినిమా కు హైప్ క్రియేట్ చేయటమేనని చెబుతున్నారు. అనుకుంటాం కానీ.. లిప్ లాక్ ఓకే అన్నాక.. సదరు కిస్ ఎలా చేస్తారన్న వివరాలు చెప్పకుండా సీన్ ఉంటుందంటారా?