Begin typing your search above and press return to search.

లూడో గేమ్ నేపథ్యంలో పాత్ర‌లే కిక్కిచ్చే ఎలిమెంట్

By:  Tupaki Desk   |   18 Nov 2020 10:30 AM IST
లూడో గేమ్ నేపథ్యంలో పాత్ర‌లే కిక్కిచ్చే ఎలిమెంట్
X
నెట్ ‌ఫ్లిక్స్ లో విడుద‌లైన తాజా మూవీ `లూడో`. అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అభిషేక్ బ‌చ్చ‌న్‌- ఆదిత్య‌రాయ్ క‌పూర్‌- రాజ్‌కుమార్ రావు- పంక‌జ్ త్రిపాఠి- ఫాతిమా స‌నాషేక్‌- స‌న్యా మ‌ల్హోత్రా- రోహిత్ సురేష్ స‌రాఫ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ నెల 12న విడుద‌లైన ఈ మూవీపై విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇందులోని పాత్ర‌ల్ని అనురాగ్ ‌బ‌సు లూడో గేమ్ త‌ర‌హాలో మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఒక్కో పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో సాగేలా వి‌నోదాన్ని జోడించి డిజైన్ చేశారు. `మీర్జాపూర్‌` ఫేమ్ పంక‌జ్ త్రిపాళి ఇందులో స‌త్తూ భాయ్ ‌గా న‌టించాడు. మాఫియా డాన్ ‌గా కొత్త త‌ర‌హాలో విభిన్న వేష‌ధార‌ణ‌తో ఆయ‌న అల‌రించారు. ప్ర‌జ‌ల్ని చంప‌డాన్ని త‌న‌దైన శైలిని ఎంచుకునే స‌త్తూ భాయ్.. మ‌ర్ద‌ర్ చేయ‌డం ద్వారా వారి ఆత్మ‌ల‌కు విముక్తి క‌లిగిస్తున్నాన‌ని చెబుతుంటాడు. అభిషేక్ బ‌చ్చ‌న్ పాత్ర కూడా విభిన్నంగానే వుంది. ఇందులో బిట్టు అనే అహంకారిగా అతడు న‌టించారు. త‌న‌ని వ‌దిలి వెళ్లిన భార్య‌ని కాద‌ని.. త‌న కూతురి కోసం త‌పించే పాత్ర‌లో స్మాల్ బి క‌నిపించాడు. ‌

రాజ్‌కుమార్ రావు పాత్ర పేరు ఆలు. మిథున్ ‌చ‌క్ర‌వ‌ర్తికి వీరాభిమాని. సొంతంగా రెస్టారెంట్ ని న‌డిపిస్తుంటాడు. ఎప్పుడు ఆందోళ‌న అనిపించినా మిథున్ డిస్కోడ్యాన్స్ పాట‌ల్నిప్లే చేస్తూ డిస్కో డ్యాన్స్ చేస్తుంటాడు. ఇలా మ‌న చుట్టూ క‌నిపించే పాత్ర‌ల్లా చిత్ర విచిత్ర‌మైన పాత్ర‌ల‌తో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా అనురాగ్ బ‌సు మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంటుంది. లూడో గేమ్ త‌ర‌హాలో పాత్ర‌ల‌ని న‌డిపించిన తీరు అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అద్దంప‌డుతోంది. దీంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ మూవీకి చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.