Begin typing your search above and press return to search.
సంచలనాల 'జస్టిస్ లీగ్' లీకులతో భేజారు
By: Tupaki Desk | 11 March 2021 8:00 AM ISTమా సినిమా ఫుటేజ్ లీకైపోయింది.. సైబర్ నేరమిది! అంటూ లబోదిబోమనడం ఇటీవల ఫ్యాషన్ గా మారింది. ఇందులో ఎలాంటి ప్రచార జిమ్మిక్కు ఉందో బాబోయ్! అని జనం కూడా తలలు పట్టుకుంటున్నారు. పబ్లిసిటీ ఖర్చులు తగ్గించుకునేందుకు ..మీడియాకి ప్రకటనలు ఎగవేసేందుకు హైప్ కోసం వేసే ఎత్తుగడలు ఎన్నో.
ఇలాంటి ట్రిక్కులు హాలీవుడ్ టు టాలీవుడ్ ఎన్నో. అయితే అలా లీక్ చేసినవి చూస్తేనే కిక్కు అంటూ ఎదురు చూసే బాపతు జనం ఉన్నారని ప్రూవైంది. ఏదేమైనా ఇప్పుడు హాలీవుడ్ లో ఈ టైప్ లీకుల గొడవ మరీ ఎక్కువే అయినట్టు కనిపిస్తోంది.
ప్రఖ్యాత దర్శకుడు జాక్ స్నైడర్ రూపొందించిన `జస్టిస్ లీగ్` లీక్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. నిజానికి టామ్ & జెర్రీకి బదులుగా జస్టిస్ లీగ్ టీవీల్లో టెలీకాస్ట్ అయిపోవడంతో అంతా ఖంగు తిన్నారు. ఆ తరవాత `ఇది ఒక పెద్ద పొరపాటు. ఆ పని చేసిన వారిని తొలగిస్తారు`` అంటూ ప్రచారం సాగిపోయింది.
నిజానికి మార్చి 18 న మూవీ విడుదల కానుంది. కానీ అంతకుముందే హెచ్.బి.ఓ మాక్స్ లో లీక్ అయిపోయింది. `టామ్ & జెర్రీ`కి బదులుగా ఈ సినిమా ఆడింది. నిజానికి టామ్ అండ్ జెర్రీ కోసం వేచి చూసినవారంతా.. జస్టిస్ లీగ్ ఆటను HBO మాక్స్ లో చూసేశారు. చాలా మంది చందాదారులు ఇది చూసి ఆశ్చర్యపోయారట.
HBO మాక్స్ పై స్నైడర్ కట్ లీక్ గురించి ట్వీట్ చేసిన తర్వాత ఒక గంట సినిమా (రఫ్ కట్) ఎయిర్ అయిపోయాక పొరపాటును సరిదిద్దారు. ఆ తర్వాతనే టామ్ & జెర్రీ తిరిగి ఆడటం స్టార్టయ్యింది. దీనిపై వార్నర్స్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ లీక్ ఇచ్చింది ఎందుకు? అంటే.. మూవీలో సీజీఐ ప్రమాణాలు బెస్ట్ గా ఉన్నాయని చెప్పేందుకే .. పబ్లిసిటీ స్టంట్! అంటూ ఒక సెక్షన్ విమర్శలు గుప్పిస్తోంది.