Begin typing your search above and press return to search.
హిట్ మూవీ సీక్వెల్ ముగిసింది
By: Tupaki Desk | 1 Sept 2021 9:00 PM ISTతమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పిసాసు సినిమా కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతుంది. 2014 లో విడుదల అయిన పిసాసు కు సీక్వెల్ గా రూపొందుతున్న పిసాసు 2 లో ప్రత్యేక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ గా ప్రముఖ దర్శకుడు మిస్కన్ రూపొందిస్తున్నాడు. కోలీవుడ్ లో మిస్కన్ కు మంచి గుర్తింపు ఉంది. ఆయన సినిమా అంటే అక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ప్రస్తుతం పిసాసు 2 సినిమా పై అంచనాలు భారీగా పెంచుకుని ఎదురు చూస్తున్నారు.
ఈమద్య కాలంలో పాన్ ఇండియా స్టార్ నటుడిగా గుర్తింపు దక్కించుకున్న విజయ్ సేతుపతి పిసాసు 2 లో కీలక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. విజయ్ సేతుపతి గెస్ట్ అప్పియరెన్స్ వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. విజయ్ సేతుపతి ఉండటం వల్ల కేవలం తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ను ఈ సినిమా దక్కించుకుంటుంది. డబ్బింగ్ చేసి ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.
తెలుగు లో విజయ్ సేతుపతి ఉప్పెనతో సూపర్ హిట్ ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఓకే అంటే పది మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట. మంచి పాత్రలు మరియు సినిమాలను ఎంపిక చేసుకునే క్రమంలో మెల్లగా ఆయన సినిమాలు చేస్తున్నాడు. తమిళంలో మాత్రం ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హిందీలో కూడా విజయ్ సేతుపతి సినిమాలు చేస్తున్నట్లుగా టాక్. హీరోగానే కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అనేక విధాలుగా విజయ్ సేతుపతి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో పిసాసు 2 సినిమాకు ఆయన అప్పియరెన్స్ ఖచ్చితంగా పాజిటివ్ బజ్ ను తీసుకు వస్తుంది.