Begin typing your search above and press return to search.
న్యూ ఇయర్లో హీట్ పెంచనున్న కుర్ర హీరోయిన్లు
By: Tupaki Desk | 28 Dec 2020 11:00 PM ISTఈ ఏడాది ఓ చేదు అనుభవంగానే మిగిలిపోయింది .. అందువల్లనే వచ్చే ఏడాది ఒక తీపి జ్ఞాపకంగా మారాలని అంతా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది సరదాగా .. సంతోషంగా .. సంబరాలతో సాగిపోవాలని కోరుకుంటున్నారు. ప్రధాన వినోదసాధనమైన సినిమాలకి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉండాలని భావిస్తున్నారు. ఇలా కొత్త ఆశలతో .. కొత్త కలలతో అందరూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంటే, ముగ్గురు కుర్ర హీరోయిన్లు మాత్రం న్యూ ఇయర్లో పడుచు మనసులను హీట్ ఎక్కించడానికి రెడీ అవుతున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ 'అనన్య పాండే' పరిచయం అవుతోంది. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది. అందువలన రొమాంటిక్ పాళ్లు ఎక్కువే. విజయ్ దేవరకొండతో కలిసి ఈ పిల్ల చేసే రొమాన్స్ చూడడానికి రెండు కళ్లు చాలవట. మరో రెండు పడుచు కళ్లు ఎవరైనా అప్పిస్తే బాగుండునని అనుకునేలా ఉంటుందట అమ్మడి సోయగం.
వచ్చే ఏడాదిలో దర్శకుడిగా మరోసారి తన దమ్ము చూపించడానికి పూరి జగన్నాథ్ రెడీ అవుతుంటే, హీరోగా దుమ్మురేపేయడానికి ఆయన కొడుకు ఆకాశ్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ కుర్రాడు హీరోగా రూపొందిన 'రొమాంటిక్' వచ్చే ఏడాది థియేటర్స్ కి రానుంది. ఈ సినిమా ద్వారా 'కేతిక శర్మ' పరిచయమవుతోంది. పోస్టర్ తోనే పిచ్చెక్కించిన ఈ అమ్మాయిని తెరపై చూడటానికి కుర్రాళ్లంతా తహతహ లాడుతున్నారు. సినిమా పేరే 'రొమాంటిక్' కావడంతో, యూత్ ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకుంది.
ఇక కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న 'ఉప్పెన' సినిమా కూడా న్యూ ఇయర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సొట్టబుగ్గలతో హోల్ సేల్ గా గుండె గోడలని కూల్చేసిన ఈ అమ్మాయిని తెరపై చూడటం కోసం, కుర్రమనసులన్నీ కాచుకు కూర్చున్నాయి. ఇలా వచ్చే ఏడాదిలో ముగ్గురు కుర్ర హీరోయిన్లు తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. పూల రేకుల్లా .. పూత రేకుల్లా నాజూకుగా కనిపించే ఈ ముగ్గురిలో, ఎవరు ఎక్కువ మంది మనసులను గెలుచుకుంటారో .. పడుచు అభిమానుల హృదయాలను పంచుకుంటారో చూడాలి మరి!