Begin typing your search above and press return to search.

40 లో స్వీట్ 16లా మారిపోయిన హీరోయిన్!

By:  Tupaki Desk   |   30 April 2022 12:30 AM GMT
40 లో స్వీట్ 16లా మారిపోయిన హీరోయిన్!
X
దాదాపు ద‌శాబ్ధం పాటు టాలీవుడ్ ని ఏలిన భూమిక ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `యువ‌కుడు`తో ప‌రిచ‌య‌మైన బ్యూటీ అటుపై `ఖుషీ` సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ ఒక్క స‌క్సెస్ యూత్ లో ఎన‌లేని క్రేజ్ ని తీసుకొచ్చింది. ఆ త‌ర్వాత చాలా కాలం పాటు వెనుదిరిగి చూసుకోకుండా కెరీర్ ముందుకు సాగిపోయింది. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో భూమిక ఫీవ‌ర్ కొన‌సాగింది. తెలుగు...హిందీ..క‌న్న‌డ భాష‌ల్లో న‌టించి భూమిక న‌టిగా త‌న‌కంటూ ఓ పేజీని రాసుకుంది.

అయితే హీరోయిన్ గా సాగినంత‌గా కెరీర్ భూమిక సెకెండ్ ఇన్నింగ్స్ సాగ‌లేదు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు అక్క ..వ‌దిన పాత్ర‌ల్లో న‌టించడం త‌ప్ప ప‌వ‌ర్ ఫుల్ రోల్ ప‌డ‌లేదు. యోగా ట్రెయిన‌ర్ భ‌ర‌త్ ఠాకూరుతో వివాహం త‌ర్వాత విడిపోవ‌డం తో భూమిక మ‌ళ్లీ సినిమా కెరీర్ స్పీడ‌ప్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. కానీ అంత బిజీ కాలేక‌పోయారు. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నారు. వ‌య‌సు నాలుగు ప‌దులు దాటింది.

అయితే భూమిక హాట్ ఫోజు ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇందులో ఆమె స్వీట్ 16 గాళ్ గా క‌నిపిస్తుంది. బ్లాక్ క‌ల‌ర్ పొట్టి నిక్క‌రు ధ‌రించి..స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో స్లిమ్ లుక్ లో ఆక‌ట్టుకుంటుంది.

అయితే భూమిక ఈలుక్ లో నెటిజ‌నుల్ని ఏమార్చారు. భూమిక 40 ప్ల‌స్ లో ఇంత అందంగా త‌యారైందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. 40 లో 16 లుక్ ఏంటి అంటూ! యువ‌త పోటీప‌డీ మ‌రి ప్ర‌శంసిస్తున్నారు.

ఇంకొంత మంది నిజంగా 16 లోకి మారిపోయారా? అంటున్నారు. కార‌ణాలు ఏవైనా భూమిక ఇప్పుడు నెట్టింట యువ‌తలో మంట‌లు రేపుతుంది. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నంత కాలం ఇలాంటి ఫోటోల్లో ఎప్పుడూ భూమిక క‌నిపించ‌లేదు.

న‌టిగా కొన్ని క‌ట్టుబాట్లుతో ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ గా ఛ‌రిష్మా ఉన్నంత కాలం అంతే హుందాగా న‌డుచుకున్నారు. రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఏనాడు ఎఫైర్ వార్త‌ల్లో భూమిక పేరు వినిపించిది లేదు.