Begin typing your search above and press return to search.

పవన్ ను మరిచి ఆపై సారి చెప్పిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   2 May 2021 4:33 AM GMT
పవన్ ను మరిచి ఆపై సారి చెప్పిన హీరోయిన్‌
X
పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ సూపర్‌ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వకీల్ సాబ్‌ రూపొందింది. పింక్ కు కమర్షియల్‌ టచ్ ఇచ్చి దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ను థియేటర్లలో చూడలేని వారు చూసిన వారు కూడా ఇప్పుడు అమెజాన్‌ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా అమెజాన్‌ లో ఈ సినిమా ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా చేరింది.

సినిమా ను అమెజాన్ ప్రైమ్‌ లో చూసిన తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ స్పందించారు. మొదట ఆమె పవన్ కళ్యాణ్‌ పేరును చేర్చకుండానే ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత తన తప్పును గమనించిన వెంటనే ట్వీట్ ను ఎడిట్ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పేరును చేర్చిన తర్వాత మళ్లీ తన తప్పుకు సారి కూడా చెప్పింది. నేను ఇప్పుడే తెలుసుకున్నాను పవన్ కళ్యాణ్‌ గారంటే నాకు గౌరవం మరియు ప్రేమ అంటూ స్పెషల్‌ గా ట్వీట్‌ చేసింది.

ఇక సినిమా గురించి ఆమె ట్విట్టర్‌ లో... అమెజాన్ ప్రైమ్‌ లో గత రాత్రి వకీల్ సాబ్‌ ను చూశాను. పవర్ ఫుల్‌ నటన మరియు మంచి మెసేజ్‌. పవన్‌ కళ్యాణ్ గారు మంచి సందేశంను ఇచ్చారు. ముగ్గురు అమ్మాయిల కోసం నిలబడ్డ ఆయన నటన బాగుంది. అంజలి.. నివేథ.. అనన్యల నటన బాగుంది. ప్రకాష్‌ రాజ్‌ గారు మీరు లేకుండా ఈ సినిమా అసంపూర్ణం అంటూ ట్వీట్‌ చేసింది.