Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ ముఠాను ప‌ట్టుకున్న‌ హీరోయిన్‌!

By:  Tupaki Desk   |   15 April 2021 2:30 AM GMT
డ్ర‌గ్స్ ముఠాను ప‌ట్టుకున్న‌ హీరోయిన్‌!
X
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌.. సందీప్ కిష‌న్ న‌టించిన 'తెనాలి' చిత్రంలో లేడీ విలన్ గా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్ద‌గా వ‌ర్కవుట్ కాక‌పోవ‌డంతో.. ఈ యాక్ట్రెస్ యాక్టింగ్ కూడా ఎలివేట్ కాలేదు. అయితే.. ఆ త‌ర్వాత వ‌చ్చిన 'క్రాక్', దాని త‌ర్వాత వ‌చ్చిన 'నాంది' చిత్రాలతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేశారు.

అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టినీ ఆక‌ర్షించారు. దీంతో.. పవర్ ఫుల్ లేడీ పాత్రలు చేయాలంటే.. వరలక్ష్మినే ఫస్ట్ ఛాయిస్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ క్రమంలో లేడీ ఓరియంటెడ్ సినిమాతో ముందుకు రాబోతున్నారు వ‌ర‌ల‌క్ష్మి. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆమె లీడ్ రోల్ పోషించిన‌ చిత్రం 'ఛేజింగ్‌'.

దేశంలో డ్రగ్స్ దందా చేస్తున్న రౌడీమూకల కీళ్లు విరిచే ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు వరలక్ష్మి. కొందరు బడాబాబులు విదేశాల నుంచి డ్రగ్స్ తరలిస్తూ.. ఇక్క‌డ అమ్మాయిల మాన‌ప్రాణాల‌ను దోచుకుంటూ ఉంటారు. అలాంటి వారిని త‌న టీమ్ తో ఓ ఆట ఆడిస్తుందీ స్పెష‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌. ఈ బ్యాక్ డ్రాప్ తో చాలా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. లేడీ లీడ్ రోల్ లో ఇదేమొద‌టి చిత్ర‌మ‌ని చెబుతున్నారు మేక‌ర్స్‌. ఏషియ‌న్ మీడియా బ్యాన‌ర్ పై మ‌దియ‌ళ‌గ‌న్ మునియాండి నిర్మిస్తున్నారు. కేకే కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌సి మ్యూజిక్ అందిస్తున్నారు.