Begin typing your search above and press return to search.

కోవిడ్ సోకిన వారంలోనే 'వకీల్ సాబ్' థియేటర్ లో ప్రత్యక్షమైన హీరోయిన్..!

By:  Tupaki Desk   |   10 April 2021 5:25 PM IST
కోవిడ్ సోకిన వారంలోనే వకీల్ సాబ్ థియేటర్ లో ప్రత్యక్షమైన హీరోయిన్..!
X
యంగ్ బ్యూటీ నివేదా థామస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో కీలక పాత్రలో నటించిన నివేదా.. ఆ మూవీ ప్రమోషన్స్ పాల్గొంటున్న సమయంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏప్రిల్ 3న ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నివేదా.. ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని, తనతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు 'వకీల్ సాబ్' థియేటర్ లో సినిమా చూస్తున్న ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

"ఈ మూమెంట్ కోసమే జీవిస్తున్నాను.. మాటలు లేవు" అని పోస్ట్ చేసిన నివేదా థామస్.. ప్రేక్షకులు థియేటర్ లో 'వకీల్ సాబ్' సినిమాని ఆసక్తిగా చూస్తున్న ఓ పిక్.. థియేటర్ బాల్కనీ వద్ద తను నిలబడి ఫోటోలు పోస్ట్ చేసింది. ఆమె ప్రేక్షకుల మధ్య కూర్చోకుండా.. పైన దూరంగా నిల్చొని సినిమా చూసినట్లు అర్థం అవుతోంది. అంతేకాకుండా చేతులకు గ్లౌజ్, ముఖానికి మాస్క్ పెట్టుకొని కనిపించింది. అయినప్పటికీ కరోనా నెగిటివ్ వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండా.. ఇలా కరోనా సోకిన వారం రోజులకే థియేటర్ కి రావడమేంటని ఆమెను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఏప్రిల్ 7న ''ఆల్ ఓకే.. మీ ప్రార్థనలకు వెల్ విషెస్ కు ధన్యవాదాలు'' అంటూ ఓ ట్వీట్ పెట్టింది. దీనిని బట్టి నివేత ముందుగానే తనకు కరోనా నెగిటివ్ వచ్చినట్లు చెప్పిందని అనుకోవచ్చేమో!