Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ గా మార‌బోతున్న హీరోయిన్ భ‌ర్త‌.. ఆమె న‌టిస్తోందా..?

By:  Tupaki Desk   |   26 Feb 2021 1:00 PM IST
డైరెక్ట‌ర్ గా మార‌బోతున్న హీరోయిన్ భ‌ర్త‌.. ఆమె న‌టిస్తోందా..?
X
‘ఈ రోజుల్లో..’ మూవీ లో తొలిసారి కనిపించిన వరంగల్ బ్యూటీ ఆనంది.. ఆ తర్వాత ‘బస్టాప్’ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత.. ‘ప్రియతమా నీవచట కుశలమా’తో పాటు పలు సినిమాలు చేసింది. కానీ.. పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో కోలీవుడ్‌ కి షిఫ్ట్ అయిపోయిందీ బ్యూటీ.

అక్కడ తన నటన తో అందరినీ ఇంప్రెస్ చేసిన ఆనంది.. ఫుల్ బిజీ అయిపోయింది. అందంతోపాటు అద్భుతమైన యాక్టింగ్ తో కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న ఓరుగల్లు చిన్నది.. మళ్లీ ‘జాంబీరెడ్డి’తో టాలీవుడ్ తలుపు తట్టింది. అయితే.. హఠాత్తుగా ఈ జనవరి లో పెళ్లిపీటలు ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోక్రటీస్ అనే మెరైన్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుందీ టాలెంటెడ్ యాక్ట్రెస్!

ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో నటిస్తోంది ఆనంది. అయితే.. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పిందీ బ్యూటీ. అయితే.. లేటెస్ట్ గా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. తన భర్త సోక్రటీస్ అతి త్వరలో దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడని ప్రకటించింది.

సోక్రటీస్ పెద్ద సినిమా లవర్ అని, గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశాడని వెల్లడించింది. మరి, ఎలాంటి స‌బ్జెక్ట్ తో రాబోతున్నాడు? అనేది తెలియాల్సి ఉంది. అదే సంద‌ర్భంలో.. త‌న భ‌ర్త డెబ్యూ మూవీలో ఆనంది న‌టిస్తోందా? లేదా? అనేది కూడా చూడాలి.