Begin typing your search above and press return to search.
జాకీకి ట్రిపుల్ బెడ్ రూమ్ కానుకిచ్చిన హీరో
By: Tupaki Desk | 28 Dec 2021 12:02 PM ISTమనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి తవ్వే కొద్ది విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. 200 కోట్ల కుంభ కోణంలో కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్ర శేఖర్ తో సన్నిహిత సంబంధం కారణంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న జాక్వెలిన్ పెర్నాండేజ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సుకేష్ నుంచి ఖరీదైన బహుమానాలు పొందడంతో శ్రీలంకన్ బ్యూటీ అడ్డంగా బుక్కైంది. ఈడీ విచారణలో అసలు జాక్వెలిన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నం అయ్యాయి. జాక్వెలిన్ కే కాదు సుకేష్ ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటికప్పుడు ఖరీదైన బహుమతులు పంపించేవాడని విచారణలో చెప్పిన సంగతి తెలిసినదే.
అలాగే జాక్వెలిన్ కి బహుమతులు తీసుకునే అలవాటు చాలా కాలంగానే ఉందిట. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఆమెకు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చాడట. అయితే ఇది స్నేహపూర్వకంగా జరిగిందే. సల్మాన్-జాక్వెలిన్ జంటగా చాలా సినిమాలు చేసారు. పైగా హీరోయిన్లకు బహుమతులు ఇవ్వడం సల్మాన్ కి చాలా కాలంగా ఉన్న అలవాటు. సల్మాన్ నుంచి బహుమతులు అందుకున్న హీరోయిన్లలలో చాలా మంది ఉన్నారు. కత్రినాకైఫ్..కరీనా కపూర్ ఇలా పలువురు భామలు బహుమతులు పొందిన వారు. అయితే వీళ్లిందరికంటే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సల్మాన్ నుంచి ఎక్కువ బహుమతులు పొందిందని తెలిసింది.
ముంబైలో ఖరీదైన ఏరియాలో ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్.. ఆడి కార్ సహా మరో లగ్జరీ కారు బహుమతులుగా తనతో సినిమాలు చేసినప్పుడు ఇచ్చాడని ఈడీ విచారణలో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని బట్టి జాక్వెలిన్ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? అన్న దానిపై ఈడీ అధికారులు ఓ అంచనాకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుకేష్ విషయంలో ఆమెను మరింత లోతుగా విచారించే అవకాశం కనిపిస్తోంది.
కాన్ మన్ బయోపిక్ స్టోరి జాకీ చుట్టూనే..!
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. కి కోట్లాది రూపాయల విలువ చేసే కానుకలు ఇచ్చాడు కాన్ మ్యాన్ సుకేష్ చంద్రశేఖర్. జాక్విలిన్ తో అతడి రొమాన్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలాన్ని షేక్ చేశాయి. ఇటీవల ఇలాంటి తప్పుడు కారణాలతో ఇతర నాయికల పేర్లు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అపఖ్యాతి పాలైన సుకేష్ చంద్రశేఖర్ తో కథానాయికల లింకప్ ఆరోపణలు రిలేషన్ షిప్ సంచలనంగా మారింది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. ఇప్పుడు కొంతమంది దర్శకనిర్మాతలతో కలిసి కొన్ని OTT ప్లాట్ ఫారమ్ లు సుకేష్ చంద్రశేఖర్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రేమకథపై సిరీస్ ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాయని తెలుస్తోంది..
ప్రముఖ మీడియా నివేదిక ప్రకారం.. సుకేష్ చంద్రశేఖర్ - జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ల వివాదాస్పద కేసు పై వెబ్ సిరీస్ ను రూపొందించడానికి సరైన సరంజామా ఉందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మొత్తం కేసును సినిమా సిరీస్ గా ఎలా మార్చాలనే దానిపై కొంతమంది నిర్మాతలు .. స్ట్రీమింగ్ దిగ్గజాలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. కాన్-మ్యాన్ .. అలాగే జాకీ .. నోరా పాత్రల కోసం కొన్ని పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ భారీ స్థాయిలో కాన్ ఆపరేషన్ ఆధారంగా సిరీస్ ని చూడాలన్న ఆసక్తి ప్రజల్లో ఉంది.
ఇంతకుముందు ED తో ఆమె ప్రశ్నించిన సమయంలో జాక్వెలిన్ సుఖేష్ గురించి తెలుసని .. అతని నుండి విలాసవంతమైన బహుమతులు పొందినట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. 500 కోట్ల విలువైన సూపర్ హీరో చిత్రాలను నిర్మిస్తానని కాన్-మ్యాన్ వాగ్దానం చేసాడు. అందులో అతను శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ టైటిల్ పాత్రలో నటించాలనుకుందన్న విషయం బయటపడింది.
జాక్వెలిన్ కాకుండా... శిల్పాశెట్టి - శ్రద్ధా కపూర్ వంటి ఇతర పేర్లను కూడా సుకేష్ వెల్లడించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నోరా ఫతేహి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. అతడు స్ఫూఫ్ కాల్స్ చేసి వలల వేయగలడు. పెద్ద పరిచయాలున్నాయని మాట కలిపేయగలడు. అటుపై కథానాయికలతో రొమాన్స్ చేయగలడు. దోచుకోగలడు! ఇక ఈ స్టోరీలోనే జాకీకి సల్మాన్ ఖాన్ ఇచ్చిన కానుకల గురించి ప్రస్థావిస్తారా? అన్నది ఇప్పుడు కొత్త ట్విస్ట్.