Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌ రాముడి స్టోరీనే కాని రామాయణం కాదు!!

By:  Tupaki Desk   |   24 Sep 2020 5:30 PM GMT
ఆదిపురుష్‌ రాముడి స్టోరీనే కాని రామాయణం కాదు!!
X
ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న మొదటి హిందీ సినిమా 'ఆదిపురుష్‌' పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్నట్లుగా ఇప్పటిక విడుదలైన టైటిల్‌ లోగో మరియు మోషన్‌ పోస్టర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ సినిమా గురించి స్పందించిన రాజమౌళితో పాటు ప్రముఖులు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఈ సమయంలో రాముడిపై సినిమా అంటే ఖచ్చితంగా హైప్‌ ఉంటుంది. ఆదిపురుష్‌ కు ఖచ్చితంగా మంచి క్రేజ్‌ దక్కుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్‌ స్టోరీకి రామాయణంకు సంబంధం లేదు అన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆదిపురుష్‌ లో హీరో పాత్ర రాముడి లా ఉంటుందని.. సినిమాలోని పలు పాత్రలు రామాయణంలో ఉన్న పాత్రల మాదిరిగానే ఉంటాయి. కాని కథ మాత్రం రామాయణం కాదు అంటూ బాలీవుడ్‌ కు చెందిన ఒక వర్గం మీడియాలో కథనాలు వస్తున్నాయి. రామాయణంలోని పాత్రల స్వభావంను తీసుకుని వాటితో మరో కథను చూపించేదే ఆదిపురుష్‌ అంటున్నారు.

ఆదిపురుష్‌ లో ప్రభాస్‌ రాముడి పాత్రే అయినా ధనస్సు పట్టుకుని నీలవర్ణంలో కనిపించబోడు. అలాగే ఈ సినిమాలో విలన్‌ పేరు లంకేష్‌ అయినా కూడా రావణుడి మాదిరిగా పది తలలు ఉండవు రాక్షస రాజు కాదట. మొత్తానికి సినిమా ఖచ్చితంగా అందరి అంచనాలు అందుకునేలా ఉండటంతో పాటు ఊహకు అందని విధంగా ఉంటుందని మేకర్స్‌ చాలా నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను మొదలు పెట్టి 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.