Begin typing your search above and press return to search.

వీడియో: క‌త్తి లాంటి ప్ర‌మోష‌న్

By:  Tupaki Desk   |   4 March 2020 10:00 AM GMT
వీడియో: క‌త్తి లాంటి ప్ర‌మోష‌న్
X
క‌త్రిన ఏంటో ఏజ్ పెరిగే కొద్దీ క‌త్తి క‌న‌క‌మ్మలా వేషాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయ్. ఇటీవ‌లే సౌంద‌ర్య ఉత్ప‌త్తుల బిజినెస్ ప్రారంభించింది మొద‌లు నేచుర‌ల్ లుక్ అంటూ స్పైసీ గా క‌నిపిస్తూ తెగ క‌వ్వించేస్తోంది. తాజా వీడియోలో అంత‌కుమించి సెక్స‌ప్పీల్ తో క‌ట్టిపడేసింది కొంటె క‌త్రిన‌. ఇదిగో ఇలా సెకనుకో ఎక్స్ ప్రెష‌న్ చొప్పున ఆరు సెన్ల‌లో ఆరు ఎక్స్ ప్రెష‌న్స్ తో తెగ చంపేసిందిలా. ఇంత‌కీ ఇంత‌ త‌క్కువ టైమ్ లో అంత‌గా చంపేయ‌డ‌మెలానో క్యాట్ చెబుతుందా? అస‌లు అంత వైబ్రేంట్ గా టిక్ టాక్ చేయ‌డ‌మెలానో అభిమానుల‌కు క్యాట్ నేర్పిస్తుందా.. అన్న‌ది చూడాలి.

త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతున్న అంగ్రేజీ మీడియం (హిందీ మీడియం సీక్వెల్) చిత్రానికి ప్ర‌చారం చేస్తూ క‌త్రిన ఇలా టిక్ టాక్ చేసింది. క‌ళ్ల‌తోనే కొంటెగా క‌వ్వించేస్తూ ఆ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చిన తీరు మైమ‌రిపించింది. ఆ ఎల్లో మిడ్డీలో గాల్లో ఎగిరి క‌త్రిన ఇచ్చిన ఆ ఫోజు ఇట్టే కుర్రాళ్ల‌కు క‌నెక్ట‌యిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఈ వీడియో జోరుగా వైర‌ల్ అయి పోతోంది. ఇంత‌కు ముందు జాన్వీ.. అన‌న్య పాండే ఈ త‌ర‌హా ప్ర‌చారం చేశారు. ఇక అంగ్రేజీ మీడియం లో ఇర్ఫాన్ ఖాన్ కథానాయ‌కుడిగా న‌టించారు.

ప్ర‌స్తుతం విక్కీ కౌశ‌ల్- క‌త్రిన జంట `భూత్ 1- ది హాంటెడ్ షిప్` సిరీస్ లో న‌టిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని.. క‌త్రిన అంథేరి (ముంబై) భ‌వంతిలో క‌లుసుకుంటున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. కొత్త జంట ల‌వ్ స్టోరీపై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఊరి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత విక్కీ ఇలా సీనియ‌ర్ ల‌వ్ లో ప‌డి కెరీర్ ని నాశ‌నం చేసుకుంటున్నాడ‌ని అభిమానులు క‌ల‌త‌కు గుర‌వ్వ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.