Begin typing your search above and press return to search.

'మిడిల్ క్లాస్ మెలోడీస్' లో 'గుంటూరు' సాంగ్ అదిరింది

By:  Tupaki Desk   |   9 Nov 2020 1:10 PM GMT
మిడిల్ క్లాస్ మెలోడీస్ లో గుంటూరు సాంగ్  అదిరింది
X
విజయ్‌ దేవరకొండ వారసుడిగా అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లోకి దొరసాని మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ కాకున్నా తొలి సినిమాతోనే ఆనంద్ నటుడిగా బాగానే ఆకట్టుకున్నాడు.ఆనంద్ తన రెండో చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్‌ దర్శకత్వంలో ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.

ఈ కథ గుంటూరు నేపథ్యంలో సాగనుంది. తాజాగా ఈ సినిమానుంచి మొదటి పాటను ప్రత్యేక చిత్రాల దర్శకుడు క్రిష్ చేతులమీదుగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ఆసాంతం గుంటూరునగర విశిష్టతను వివరిస్తూ సాగింది. గుంటూరులో ప్రముఖమైన అన్ని అంశాలు ఈ పాటలో చాలా చక్కగా కుదిరాయి. సినీ ఆడియన్స్ నుంచి కూడా ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక గుంటూరు వాళ్లకు ఈ పాట మరింతగా నచ్చింది. చక్కగా గుంటూరు గురించి రాశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ హిట్ తన అన్న విజయ్ లాగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.