Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ - ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’.. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు!

By:  Tupaki Desk   |   4 Feb 2021 12:15 PM IST
ట్రైలర్ టాక్ - ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’.. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు!
X

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. అదితిరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’‌లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతంది. ఫిబ్రవరి 26 న ఈ మూవీని స్ట్రీమ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఫిబ్రవరి 4) ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ ట్రైలర్ చూస్తే.. సైకో థ్రిల్లర్ మూవీగా అనిపిస్తోంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ మూవీ.. ఆద్యంతం సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్ పరిణీతితో ప్రారంభమవుతుంది. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తుండగా కంటిన్యూ అవుతోంది.

ఈ చిత్రంలో పరిణీతి చోప్రా ‘మీరా కపూర్’పాత్ర పోషిస్తోంది. నిత్యం ట్రైన్ జర్నీ చేసే మీరా కపూర్.. రైలు కిటికీలోంచి ఒక మహిళ (అదితిరావు హైదరి)ను గమనిస్తూ ఉంటుంది. ఆ మహిళ ఉన్నట్టుండి ఒక రోజు చనిపోతుంది. కాదు.. హత్య చేయబడుతుంది. ట్రైలర్లో మీరా కపూర్ ఈ హత్య చేసిందా? అనే సందేహం క‌లిగేలా చూపించారు. ఆ త‌ర్వాత‌.. పోలీసులు మీరా కపూర్‌ను అదుపులోకి తీసుకుంటారు.

అయితే.. మీరా కపూర్ ఓ మానసిక స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంది. అమ్నీషియా (మెమరీ లాస్)తో బాధ‌ప‌డుతున్న ఆమె.. ‘ఆ రోజు ఏం జ‌రిగింది?’ అంటూ గుర్తు చేసుకోవ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ ప్రకారం.. ఆ మర్డర్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందనే విషయాన్ని రివీల్ చేశాడు దర్శకుడు.

ఈ చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ అనే పేరుతో వచ్చిన సూపర్ హిట్ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కూడా అదే పేరు పెట్టారు. పౌలా హాకిన్స్ రచయిత. ఈ నవల ఆధారంగా హాలీవుడ్ లో ఇప్పటికే ఓ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్ర పోషించారు. ఇండియన్ మూవీలో పరిణీతి చోప్రా ఆ ప్లేస్ ను భర్తీ చేస్తోంది. మరి, ట్రైలర్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన ఈ చిత్రం.. ఏం రేంజ్ లో ఉందో తెలియాలంటే ఫిబ్రవరి 26 వరకు వెయిట్ చేయాల్సిందే.