Begin typing your search above and press return to search.

'ది ఘోస్ట్' ట్రైలర్: కింగ్ నాగ్ ఆన్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్..!

By:  Tupaki Desk   |   25 Aug 2022 12:02 PM GMT
ది ఘోస్ట్ ట్రైలర్: కింగ్ నాగ్ ఆన్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్..!
X
కింగ్ అక్కినేని నాగార్జున మరియు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ది ఘోస్ట్''. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇంటర్‌ పోల్ ఆఫీసర్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నారు.

ఇప్పటికే 'ది ఘోస్ట్' సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ - కిల్లింగ్ మెషిన్‌ గ్లింప్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే సినిమాలో నాగ్ ఉపయోగించే ప్రాణాంతకమైన విలువైన ఆయుధం యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడానికి ఉద్దేశించిన చిన్న గ్లింప్స్ కూడా సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

'ది ఘోస్ట్' అనేది పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు.. అంతకు మించిన హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుందనే విషయాన్ని తెలియజేసేందుకు తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్‌ ను లాంచ్ చేసి, టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

ట్రైలర్ లో ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటు 'ది ఘోస్ట్' మెయిన్ స్టోరీ లైన్ ని చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇంటర్‌ పోల్ ఆఫీసర్ అయిన విక్రమ్ (నాగార్జున).. గ్యాంగ్‌ స్టర్ల నుండి ప్రమాదంలో ఉన్న తన సోదరి మరియు మేనకోడలను ఎస్కార్ట్ చేసే బాధ్యత తీసుకుంటానని తన తండ్రి (జయప్రకాష్) కి వాగ్దానం చేస్తాడు.

ఇందులో యాక్షన్ తో పాటుగా ఫ్యామిలీ డ్రామా మరియు ఎమోషనల్ కంటెంట్ ఉందనే విషయాన్ని కూడా ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఒక విలక్షణమైన సబ్జెక్ట్‌ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే అన్ని అంశాలను ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నాడు. థ్రిల్లింగ్ సన్నివేశాలతో స్టైలిష్ మేకింగ్ తో ఆశ్చర్య పరిచాడు.

ఏజెంట్ విక్రమ్‌ గా నాగార్జున తన స్టైలిష్ యాక్షన్ తో పవర్-ప్యాక్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఇంటెన్స్ రోల్ లో కనిపించాడని చెప్పాలి. ట్రెండీ కాస్ట్యూమ్స్ తో పాటుగా సూట్స్ మరియు యూనిఫామ్‌ లో చాలా కొత్తగా కనిపించారు.

ఇక నాగ్ సబార్డినేట్‌ గా కనిపించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. హీరో సోదరిగా గుల్ పనాగ్ నటిస్తుండగా.. మేనకోడలుగా అనిఖా సురేంద్రన్ కనిపించింది. విలన్ రోల్స్ కోసం తెలుగు ఆడియన్స్ కు పరిచయం లేని వారిని తీసుకున్నారు.

ది ఘోస్ట్ తన ప్రధాన ఆయుధం తమహగనేని తో శత్రువులను ఊచకోత కోయడాన్ని కూడా మనం చూడొచ్చు. ట్రైలర్‌ లో ప్రతీ బిట్ కూడా చాలా గ్రిప్పింగ్ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్-ప్యాక్డ్ గా కనిపిస్తుంది. నాగార్జున సీరియస్ గా చెప్పే డైలాగ్స్ ప్రభావంతంగా ఉన్నాయి. 'అంతం' సినిమాలో నాగ్ ను గుర్తు చేస్తున్నాయి.

ట్రైలర్ చివర్లో నాగ్ చేతిలో ఆయుధం పట్టుకుని ఒక చైర్ లో ఠీవిగా కూర్చొని ఉండటం.. ఆ పెద్ద కత్తితో విలన్ మీదకు దూకడం వంటి షాట్స్ హైలైట్ గా నిలిచాయి. ఇందులో నాగ్.. వింటేజ్ కింగ్ ఈజ్ బ్యాక్ అనే విధంగా కనిపించాడు. ఇది కచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచే సినిమా అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

లావిష్ ప్రొడక్షన్ డిజైన్ - ముఖేష్ జి సినిమాటోగ్రఫీ మరియు భరత్-సౌరబ్ రీ-రికార్డింగ్ తో పాటుగా షార్ప్ ఎడిటింగ్ దీనికి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తం మీద ఈ ట్రైలర్ తో ఇప్పటికే తగినంత సందడి చేస్తున్న 'ది ఘోస్ట్' సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పాలి.

విక్రమ్ సోదరి మరియు మేన కోడలిని చంపాలని చూస్తున్న గ్యాంగ్ స్టర్స్ ఎవరు? అసలు అండర్ వరల్డ్ వారిని ఎందుకు టార్గెట్ చేసింది? ఏజెంట్ వారి ప్రాణాలను ఎలా రక్షించాడు? అనేది తెలియాలంటే 'ది ఘోస్ట్' సినిమా చూడాల్సిందే.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా భారీ ఎత్తున 'ది ఘోస్ట్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

మార్క్ కె రాబిన్ - భరత్ - సౌరబ్ వంటి ముగ్గురు సంగీత దర్శకుడు ఈ సినిమా కోసం వర్క్ చేశారు. బ్రహ్మ కడలి ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఫైట్ మాస్టర్స్ దినేష్ సుబ్బరాయన్ మరియు కేచా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

'ది ఘోస్ట్' చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నాగ్ కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ' అదే రోజున రిలీజైన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు నాగ్ అదే స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటారేమో చూడాలి.