Begin typing your search above and press return to search.

ఘోస్ట్ కింగ్ కి స‌లాం గులాం.. ఫ‌స్ట్ లుక్ తో క్రాక్ పుట్టించిన నాగ్!

By:  Tupaki Desk   |   29 Aug 2021 5:51 AM GMT
ఘోస్ట్ కింగ్ కి స‌లాం గులాం.. ఫ‌స్ట్ లుక్ తో క్రాక్ పుట్టించిన నాగ్!
X
కింగ్ నాగార్జున పుట్టినరోజు సంద‌ర్భంగా అభిమానులు స‌హా కొలీగ్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు .. చిత్ర నిర్మాతలు నారంగ్ బృందం నాగ్ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ఘోస్ట్ అని ప్ర‌క‌టించ‌డం నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి.

ఇది ఊహించ‌నిది. పోస్ట‌ర్ చూస్తుంటే ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయ‌ని..నాగ్ శక్తివంతమైన పాత్ర‌తో మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు నిర్మాత‌ సునీల్ నారంగ్ పుట్టినరోజున విడుద‌ల చేసిన‌ ప్రీ-లుక్ పోస్టర్ లో నాగార్జున లుక్ ను బహిర్గతం చేయకపోయినా.. ఫస్ట్ లుక్ పోస్టర్ నాగ్ లో డైన‌మిజాన్ని ఎలివేట్ చేసారు. నాగ్ ఘోస్ట్ అవ‌తారంలో ఉన్నారా? అంటే.. అది క‌చ్ఛితంగా ప్ర‌త్యేకత క‌లిగిన డైన‌మిక్ రోల అని అర్థ‌మ‌వుతోంది. టైటిల్ ని బ‌ట్టి అదృశ్య రూపంలో ఉండి మ‌హాన‌గ‌రాన్ని శాసించే అండ‌ర్ వ‌ర‌ల్డ్ కింగ్ గా క‌నిపిస్తారా? అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

కింగ్ నాగార్జున కత్తితో దూసుకొస్తుంటే శత్రువులు అతనికి స‌లాం గులాం అంటూ నమస్కరిస్తున్నారు. ఘోస్ట్ అనేది ఈ సినిమాకి తగిన టైటిల్ అని చిత్ర‌బృందం చెబుతోంది. లండన్ లో అద్భుతమైన బిగ్ బెన్ కూడా రాత్రిపూట పోస్టర్ లో భయపెట్టేంత భీక‌రంగా క‌నిపిస్తోంది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక‌. నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు .. శరత్ మరార్ ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP -నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ ప్ర‌ధాన‌ తారాగణం. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ముఖేష్ జి ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తుండ‌గా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ‌ర్క్ చేస్తున్నారు. రాబిన్ సుబ్బు నభా మాస్టర్ స్టంట్స్ అందిస్తున్నారు.