Begin typing your search above and press return to search.
సంక్రాంతి రిలీజుల మీదే ఆ సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉంది..!
By: Tupaki Desk | 2 Jan 2021 2:00 PM ISTకోవిడ్-19 నేపథ్యంలో ఇన్నాళ్లూ థియేట్రికల్ ఎక్సపీరియన్స్ కి దూరమైన ప్రేక్షకులకు తిరిగి ఆ అనుభూతిని అందిస్తున్నారు. సగభాగం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో పాటు ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో వచ్చే సంక్రాంతికి మరో నాలుగు సినిమాలను రిలీజ్ కి రెడీ చేశారు. వీటికి ఆడియన్స్ నుంచి వచ్చే స్పందనను బట్టి మరికొన్ని సినిమాలు థియేట్రికల్ విడుదలకు సిద్ధం చేయనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న చాలా సినిమాలను వేసవి దాకా వెయిట్ చేయకుండా సంక్రాంతి తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సంక్రాంతి సీజన్ లో ముందుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి నటించిన 'మాస్టర్' తెలుగు డబ్బింగ్ ని విడుదల చేయనున్నారు. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే క్రమంలో యువ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'క్రాక్' సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయనప్పటికీ సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని జనవరి 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాలను వచ్చే రెస్పాన్స్ ని బట్టి అఖిల్ అక్కినేని నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. నాగచైతన్య 'లవ్ స్టొరీ'.. నితిన్ 'రంగ్ దే'.. శర్వానంద్ 'శ్రీకారం'.. రానా 'అరణ్య'.. వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన'.. నాని 'టక్ జగదీష్' వంటి చాలా సినిమాలు ఇప్పుడు సంక్రాంతి రిలీజులను చూసి రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం కేంద్రం 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిబంధనలు సడలిస్తే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి సంక్రాంతి తర్వాత ఏఏ సినిమాలు విడుదల తేదీలను ప్రకటిస్తారో చూడాలి.