Begin typing your search above and press return to search.
టాలీవుడ్ క్రేజీ కాంబోలో నాలుగో సినిమా.. ఇప్పట్లో సాధ్యమేనా..?
By: Tupaki Desk | 17 April 2021 2:00 PM ISTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి.. వీరి కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కలయికలో 'జల్సా' 'అత్తారింటికి దారేది' 'అజ్ఞాతవాసి' వంటి మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోగా.. ఒకటి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక పవన్ హీరోగా నటించిన 'తీన్ మార్' సినిమాకి మాటలు రాసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ కు స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ - త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా రావడానికి అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరటాల శివతో తారక్ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేశాడు. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ మూవీ 2022 సమ్మర్ లో విడుదల అవుతుంది. దీని తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో మళ్ళీ జోడీ కట్టబోతున్నాడట.
ఇప్పటికే పవన్ కోసం త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేయడం.. దానికి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయని అనుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఉన్న బిజీకి ఇప్పట్లో ఈ ఇద్దరి కలయికలో సినిమా సాధ్యమేనా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పవన్ - త్రివిక్రమ్ కాంబోలో 'కోబలి' అనే సినిమా చేయాలని అప్పుడెప్పుడో ప్లాన్ చేసుకున్నారు. అయితే ఎందుకో ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. మరి ఇప్పుడు డిస్కషన్ లోకి వచ్చింది ఆ ప్రాజెక్టా లేదా మారేదైనా కొత్త కథనా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.