Begin typing your search above and press return to search.

యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ది ఫ్లాష్ ట్రైలర్

By:  Tupaki Desk   |   13 Feb 2023 7:54 PM IST
యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ది ఫ్లాష్ ట్రైలర్
X
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ది ఫ్లాష్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. డీసీ నుండి వచ్చిన ఈ సినిమాపై ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్లను తాకేలా ది ఫ్లాష్ మూవీ ట్రైలర్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ తో డీసీ సినియాటిక్ యూనివర్స్ గజిబిజీగా ఉంది.

అందుకే ది ఫ్లాష్ మూవీతో దానిని సరి చేసేందుకు సిద్ధమైంది డీసీ. డీసీ స్టూడియోస్ కు జేమ్స్ గన్, పీటర్ సఫ్రాన్ కో-హెడ్స్ గా మారిన తర్వాత డీసీ ఎక్స్ టెండెడ్ యూనివర్స్ ని పునర్నిర్మించే పనిని ది ఫ్లాష్ తో చేపట్టారు.

ది ఫ్లాష్ మూవీలో హీరోగా, బ్యారీ అలెన్ గా ఎజ్రా మిల్లర్ కనిపించబోతున్నాడు. ఇందులో ఫ్లాష్ తన సూపర్ పవర్స్ ఉపయోగించిన గతానికి వెళ్లి తన తల్లిని కాపాడాలనుకుంటాడు. టైమ్ లైన్ లో అతను అనుకోకుండా అల్ట్రనేట్ డైమెన్షన్స్ లోకి వెళ్లిపోతాడు. అందులో తన స్నేహితులెవరో, శత్రువులెవరో గుర్తించలేకపోతాడు.

ఈ మూవీలో బ్యాట్ మ్యాన్ గా మైకేల్ కీటన్, బెన్ అఫ్లెక్ కనిపించనున్నారు. చాలా రోజుల తర్వాత బ్యాట్ మ్యాన్ పాత్రలో బెన్ అఫ్లెక్ ను చూడటం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు ఆండీ ముషియెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ది ఫ్లాష్ స్క్రీన్ ప్లే క్రిస్టినా హాడ్సన్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో కియర్సే క్లెమోన్స్, మారిబెల్ వెర్డు, రాన్ లివింగ్ స్టన్ నటిస్తున్నారు. ది ఫ్లాష్ మూవీలో సూపర్ గర్ల్ పాత్రలో సాషా కనిపించనుంది.

ది ఫ్లాష్ మూవీ హై ఎండ్ గ్రాఫిక్స్ తో తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. డీసీ ఎక్స్ టెండెడ్ యూనివర్స్ లో ది ఫ్లాష్ మూవీది కీలక పాత్ర. మిగతా అన్ని సినిమాలకు ఇదే బేస్ కానుంది. అందుకే అదే రేంజ్ లో ఈ మూవీ ఉండేలా డైరెక్టర్ ఆండీ ముషియెట్టి తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ది ఫ్లాష్ మూవీ జూన్ 16 న 2023 విడుదల కానుంది.