Begin typing your search above and press return to search.
ఆ ప్రొడ్యూసర్ వదిలేసి మళ్లీ నిర్మిస్తున్న సినిమా.. విడుదలకు సిద్ధమైందా..??
By: Tupaki Desk | 17 Aug 2020 10:30 AM ISTఒకే ఒక తెలుగు సినిమా ఆ హీరోయిన్ కెరీర్ మార్చేసింది. కానీ ఆ హీరోయిన్ మాత్రం తెలుగు అమ్మాయి కాదు. కన్నడ బాషకు చెందిన ఆ హీరోయిన్ తెలుగు సూపర్ హిట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఎందుకో గాని వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ పోతుంది. ఇటీవలే తల్లి, తప్పిపోయిన కొడుకు నేపథ్యంలో ఓ థ్రిల్లర్ మూవీ చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే రాబట్టింది. అయితే ఆ హీరోయిన్ నుండి తర్వాత రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు కూడా లేడీ ఓరియెంటెడ్ కావడం గమనార్హం. ఇక ఆమె కెరీర్ కేవలం అలాంటి సినిమాలతోనే సాగిస్తుందేమో అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆ హీరోయిన్ కొత్త సినిమా టీజర్ విడుదల చేశారు. ప్రముఖ తెలుగు నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయం ఇప్పటిది కాదట. రెండేళ్ల క్రితమే సినిమాను వదిలేసిన నిర్మాత మళ్లీ ఆయనే నిర్మాతగా రూపొందిస్తున్నారు.
అయితే ఏ దిక్కు లేక ఏవో అతుకులు అతికించి సినిమాను మొత్తానికి కంప్లీట్ చేశారట. అయితే ఎలాంటి ఆర్భాటం చేయకుండా ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. స్పోర్ట్స్ అండ్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీకి ఓ ప్రముఖ నేషనల్ అవార్డు విన్నర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ కావడం ఆ హీరోయిన్ కి ప్లస్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎందుకంటే ఆమె చేతిలో మరో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ కూడా ఉంది. అంటే వరుసగా ఆమె నుండి ఈ జోనర్ సినిమాలే రావడంతో ప్రేక్షకులలో అలాంటి ముద్ర పడిపోతుందని అంచనా వేస్తున్నారు. కానీ మొదట్లో వదిలేసిన ప్రొడ్యూసర్ మళ్లీ ఎందుకు సినిమాను డీల్ చేస్తున్నారో.. రెండేళ్ల కిందటి సినిమా చివరికి ఓటిటి బాటపట్టడం ఏంటో అని నెటిజన్లకు చాలా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి గత సినిమా లాగే ఈ సినిమా బోల్తా కొడుతుందా లేక హిట్ అవుతుందా..? అనేది.