Begin typing your search above and press return to search.

ది ఫ్యామిలీ మ్యాన్.. 3వ సీజన్ కూడా వచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   10 Jun 2022 4:30 PM GMT
ది ఫ్యామిలీ మ్యాన్.. 3వ సీజన్ కూడా వచ్చేస్తోంది
X
ఇటీవల కాలంలో అందరూ ఎక్కువగా ఆకట్టుకున్న వెబ్ సీరీస్ లలో ది ఫ్యామిలీ మ్యాన్ టాప్ లిస్టులో ఉంటుందనే చెప్పాలి. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఆ వెబ్ సిరీస్ కు కరోనా లాక్ డౌన్ టైంలో అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకోవడం విశేషం. అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఆ వెబ్ సిరీస్ కు ఎట్రాక్ట్ అయిపోయారు అనే చెప్పాలి. దర్శకులు రాజన్ డీకే క్రియేట్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాజిక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

సెకండ్ సీజన్ కూడా ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో సమంత నటించిన విధానం కూడా దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ చేసింది.

అలాగే సమంత కెరీర్ కు కూడా ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ఎంతగానో ఉపయోగపడింది. ఇక ఈ సారి మూడవ సీజన్ కూడా అంతకు మించి అనేలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అమెజాన్ ప్రైమ్ అలాగే దర్శకులు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ది ఫ్యామిలీ మాన్ సీజన్ 3 కోసం ఇప్పటికే దర్శకుడు ఇద్దరూ కూడా ఒక స్టోరీ లైన్ అనుకున్నట్లు సమాచారం. చైనీస్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశంతో మూడవ సీజన్ రూపొందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ OTT ప్లాట్‌ఫారమ్‌లో రెండు సీజన్‌లు సూపర్ హిట్‌గా మారడంతో కల్ట్ సిరీస్‌గా మారింది. ఇక మూడో సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

తాజా రిపోర్ట్‌ల ప్రకారం, మరికొన్ని రోజుల్లో మూడవ సీజన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, దర్శకులు రాజన్ డీకే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.

అయితే సమంత కూడా మూడో సీజన్లో నటిస్తుంది అని అంటున్నారు కానీ ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక ఈ సారి బడ్జెట్ విషయంలో కూడా అమెజాన్ ప్రైమ్ ఏమాత్రం హద్దులు లేకుండా భారీగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ సీజన్ 3తో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.