Begin typing your search above and press return to search.

'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

By:  Tupaki Desk   |   31 Dec 2020 1:30 AM GMT
ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌
X
అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమ్‌ అయిన వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్‌ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియాలో మీర్జాపూర్‌ తర్వాత అత్యధికులు చూసిన వెబ్‌ సిరీస్ గా ది ఫ్యామిలీ మ్యాన్ నిలిచింది అనేది బాలీవుడ్‌ వర్గాల టాక్‌. ఇటీవలే మీర్జాపూర్‌ కు సీజన్ 2 వచ్చింది. ఇక అందరి దృష్టి కూడా ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 పై ఉంది. మొదటి సీజన్‌ సౌత్‌ లో ఎక్కువ మందికి రీచ్‌ కాలేదు. కాని ఈసారి స్ట్రీమింగ్‌ ప్రారంభంకు ముందే ది ఫ్యామిలీ మ్యాన్‌ గురించి అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సౌత్‌ లో ఈ వెబ్‌ సిరీస్ ఈసారి సమంత కారణంగా భారీ అంచనాలను కలిగి ఉంది.

మోస్ట్‌ వెయిటెడ్‌ వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 ఎట్టకేలకు స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌ ను ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్‌ కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 15 నుండి అమెజాన్ ప్రైమ్‌ లో ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 స్ట్రీమింగ్‌ కాబోతుంది అంటున్నారు. ఈసారి తెలుగులో కూడా ది ఫ్యామిలీ మ్యాన్‌ అందుబాటులో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 కోసం ఒక స్టార్‌ హీరో సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.