Begin typing your search above and press return to search.
వరస దెబ్బలతో సైలెంట్ అయిన బిగ్ బ్యానర్!
By: Tupaki Desk | 31 Jan 2020 11:37 AM ISTఅదో పెద్ద బ్యానర్. మొదట్లో వరస విజయాలతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. అయితే ఇప్పుడు వరస అపజయాలతో సతమతమవుతున్నారు. పులిమీద పుట్రలా భాగస్వాములు కూడా విడిపోయారు. ఇదిలా ఉంటే ఈ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమాల పరిస్థితి ఆశా జనకంగా లేదనే టాక్ వినిపిస్తోంది.
ఓ కొత్త హీరోతో నిర్మిస్తున్న సినిమా పరిస్థితి నీరసంగా ఉందట. హీరోకు మార్కెట్ లేకపోయినా ఎక్కువ బడ్జెట్ పెట్టారని ఇప్పుడేమో ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనే సందేహలలో ఉన్నారని అంటున్నారు. అసలే వరస షాకులు తింటూ ఉన్న ఈ బ్యానర్ కు ఈ సినిమా మరో షాకుగా మారడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యానర్ లో మరో భారీ సినిమా కూడా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కూడా ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఒకరకంగా ప్రయోగాత్మక చిత్రం. క్లిక్ అయితే సంచలనాలు సృష్టిస్తుంది కానీ తేడా కొడితే మాత్రం అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవన్నీ ఆ బ్యానర్ వారికీ తెలుసని.. అందుకే ఈమధ్య సైలెంట్ గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు గతంలో జోరుగా కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకునేవారు కానీ ఇప్పుడు మాత్రం వరసగా తగిలిన దెబ్బల కారణంగా కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకోవడంలో తొందర పడడం లేదట. అంతే కదా.. అనుభవానికి మించిన గురువు ఈ ప్రపంచం లో ఎవరుంటారు? మరి ఈ పరిస్థితి నుంచి ఈ బ్యానర్ బయట కు వస్తుందా.. తిరిగి పుంజుకుంటుందా అనేది వేచి చూడాలి.