Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డిని మార్చేసిన పిల్లలు

By:  Tupaki Desk   |   1 May 2018 8:13 AM GMT
అర్జున్ రెడ్డిని మార్చేసిన పిల్లలు
X
ప్రమోషన్స్ చేయడంలో విజయదేవరకొండ స్టలే డిఫరెంట్. చుట్టూ ఉన్నవాళ్ల వల్లనో.. లేక విజయ్ నటిస్తున్నాడు అనే అంశం వల్లనో తెలియదు గాని ప్రమోషన్స్ విషయంలో విజయ్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా అసలైన ప్రమోషన్స్ రుచి చూపించిన ఈ హీరో ఇప్పుడు టాక్సీ వాలా సినిమా కోసం కొత్త తరహా పద్దతిని ఎంచుకున్నాడు.

ఏకంగా అయిదునిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్ ద్వారా టాక్సీ వాలా వైపు అందరిని తిప్పుకున్నారు. ఇంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమా కేవలం పెద్ద వాళ్లకే అనే సర్టిఫికెట్ రావడంతో టాక్సీ వాలా అలా కాకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు చూడవచ్చని ది డ్రీమ్ బిహైండ్ టాక్సీ వాలా వీడియో ద్వారా చెప్పారు. ఈ వీడియో లోనలుగురు పిల్లలు అర్జున్ రెడ్డి సినిమా మిస్ అయినట్టుగా నెక్స్ట్ విజయ్ సినిమాను మిస్ అవ్వకూడదు అని విజయ్ ని మార్చిన తీరు చాలా బావుంది.

ప్రతి సిన్ లో తెలియని చిరునవ్వును కలిగిస్తోంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది. విజయ్ ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ తో సినిమాకు మంచి ఇంప్రెషన్ కలిగించాడని టాక్ మొదలైంది. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్లు చూసే విధంగా టాక్సీ వాలా ఉంటుందని చాలా క్లియర్ గా చెప్పారు. అసలే సమ్మర్ కావడంతో పిల్లలకు హాలిడేస్ ఉంటాయని చిత్ర యూనిట్ మంచి ప్లాన్ వేసింది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి