Begin typing your search above and press return to search.

విభేధాల‌పై ప్ర‌శ్నిస్తే తెలివిగా స్కిప్ కొట్టిన డైరెక్ట‌ర్

By:  Tupaki Desk   |   7 Sept 2021 7:00 PM IST
విభేధాల‌పై ప్ర‌శ్నిస్తే తెలివిగా స్కిప్ కొట్టిన డైరెక్ట‌ర్
X
టాలీవుడ్ లో సెన్సిబుల్ కంటెంట్ తో సినిమాల్ని తెర‌కెక్కిస్తూ త‌న‌కంటూ ఒక‌ ప్ర‌త్యేకత ఉంద‌ని నిరూపించారు ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. నిన్నుకోరి- మ‌జిలీ చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టిన ఈ ద‌ర్శ‌కుడి నుంచి ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీష్ రిలీజ్ కి వ‌స్తోంది. నిన్ను కోరి త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ తెర‌కెక్కించిన సోష‌ల్ డ్రామా మూవీ ట‌క్ జ‌గ‌దీష్‌.

అయితే ఈ సినిమా కోసం ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎస్.ఎస్.థ‌మ‌న్ తో పాటు గోపిసుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతంపై వ‌ర్క్ చేశారు. థ‌మ‌న్ పాట‌ల్ని అందించ‌గా గోపిసుంద‌ర్ రీరికార్డింగ్ కోసం ప‌ని చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సెప్టెంబర్ 10 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట‌క్ జ‌గ‌దీష్ ప్రీమియర్ కి సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. క్రైసిస్ స‌మ‌యంలో థియేట్రిక‌ల్ రిలీజ్ ని కాద‌నుకుని ఓటీటీని ఎంపిక చేశారు నిర్మాత‌లు. దీనికి ముందు వివాదాల గురించి తెలిసిన‌దే.

మజిలీ చిత్రానికి థమన్ నేప‌థ్య సంగీతం అందించ‌గా.. పాటల కోసం గోపి సుందర్ ను శివ నిర్వాణ ఉపయోగించారు. అందుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీష్ కోసం థ‌మ‌న్ పాట‌ల్ని అందించ‌గా.. గోపి సుంద‌ర్ ని రీరికార్డింగ్ కోసం ప‌ని చేసారు. అలా కావాల‌నే చేయించుకున్నారు శివ‌. నిజానికి ఈ ఎంపిక‌లు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి.

ఇదే విష‌య‌మై తాజా ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌ను ప్ర‌శ్నించ‌గా అత‌డు స‌రైన ఆన్స‌ర్ ఇవ్వ‌కుండా దాట‌వేశారు. టక్ జగదీష్ కు సింపుల్ గా ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవసరమని అందువల్ల గోపి సుంద‌ర్ ఎంపిక స‌రైన‌ద‌ని భావించాన‌ని అత‌డు తెలిపారు. నిజానికి భారీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవసరం లేని సాధారణ రిలేషన్ షిప్ డ్రామాతో మ‌జిలీ తెర‌కెక్కింది. కానీ శివ దాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ ని ఎంచుకున్నాడు. మజిలీ కోసం మంచి థీమ్ ఉన్న రీరికార్డింగ్ ని అందించ‌డంలో థ‌మన్ విజయం సాధించాడు. కానీ ఇప్పుడు ట‌క్ జ‌గ‌దీష్ విష‌యంలో రివ‌ర్స‌య్యింది.

దీనికి కార‌ణం ఆర్.ఆర్ విష‌యంలో థ‌మ‌న్ తో శివ నిర్వాణ‌కు విభేధాలొచ్చాయ‌ని గుస‌గుస‌లు వినిపించాయి. తాజా ఇంట‌ర్వ్యూలో థమన్ తో విభేదాల గురించి మాట్లాడకుండా తెలివిగా తప్పించుకోజూసాడ‌ని మ‌రోసారి గుస‌గుస వినిపిస్తోంది. సెన్సిబుల్ గా ఆలోచించ‌డ‌మే కాదు వివాదాల్ని ప‌రిష్క‌రించుకోవ‌డం తెలివిగా డీల్ చేయ‌డంలో తాను దిట్ట అని శివ నిర్వాణ నిరూపిస్తున్నార‌న్న‌మాట‌. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అనేవి స‌హ‌జం. కానీ వాటిని ఏ ప‌ద్ధ‌తిలో డీల్ చేశార‌న్న‌దే ఇక్క‌డ ఇంపార్టెంట్.

ట‌క్ జ‌గ‌దీష్ క‌థాంశం పై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. ఇందులో నాని స‌మాజంలో ఎంతో కీల‌క‌మైన ఎం.ఆర్.వో గా క‌నిపిస్తారు. రెవెన్యూ అధికారులు అంటే రాజ‌కీయాల‌తో ముడిప‌డిన ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌నిస‌రి. భూవివాదాలు ఇత‌రత్రా ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. ట‌క్ తీయ‌కుండానే నాని వాట‌న్నిటినీ ఎలా ప‌రిష్క‌రంచాడ‌న్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. ఈ సినిమా విజ‌యం పై నానీ ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే థియేట్రిక‌ల్ రిలీజ్ కి తేలేక‌పోవ‌డంపై అత‌డు నిరాశ‌గానే ఉన్నారు. నిర్మాత‌ల సేఫ్టీ కోసం ఓటీటీ రిలీజ్ కి నాని అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. నాని త‌దుప‌రి టాక్సీవాలా ఫేం రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ్యామ్ సింఘ‌రాయ్ అనే విభిన్న‌మైన చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.