Begin typing your search above and press return to search.

లొకేషన్ లో మినిస్టర్ ని పక్కకు నెట్టేసిన డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   2 May 2021 7:00 AM IST
లొకేషన్ లో మినిస్టర్ ని పక్కకు నెట్టేసిన డైరెక్టర్..!
X
'అహనా పెళ్లంట' అనే కామెడీ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు వీరభద్రం. ఆ తర్వాత 'పూల రంగడు' సినిమాతో మరో సక్సెస్ అందుకున్న వీరభద్రం చౌదరి.. మూడో సినిమాకే అక్కినేని నాగార్జున తో వర్క్ చేసే అవకాశం దక్కించుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. నాగ్ తన స్వంత బ్యానర్ లో నిర్మించిన 'భాయ్ సినిమా డిజాస్టర్ అయింది. దీని దెబ్బకు మరో సినిమా చేయడానికి చాలా కాలమే పట్టింది. ఆదితో తీసిన 'చుట్టాలబ్బాయి' సినిమా కూడా ప్లాప్ అవడంతో వీరభద్రం కొన్నాళ్లు ఇండస్ట్రీలో కనబడలేదు. ఇప్పుడు మళ్లీ ఆది తోనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర వర్క్ చేసిన వీరభద్రం ఓ ఇంటర్వ్యూలో అప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నారు.

ఈవీవీ దర్శకత్వంలో వైజాగ్ లొకేషన్స్ లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడున్న జనాలని క్లియర్ చేసే క్రమంలో మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు ని నెట్టేశానని దర్శకుడు వీరభద్రం వెల్లడించారు. ఆయన రాజకీయ నాయకుడని తనకు తెలియదని.. కెమెరా దగ్గరకు వెళ్తున్నాడని అతనిని అనాలోచితంగా నెట్టేయడంతో కింద పడిపోయాడని దర్శకుడు తెలిపాడు. దీనిని చూసిన మిగతా టెక్నిషియన్స్ అందరూ ఈవీవీ సత్యనారాయణ తనని టీమ్ లో నుండి తీసేస్తారని హెచ్చరించారని.. దానికి అప్పుడు భయపడలేదు కానీ కాస్త నెర్వస్ గా ఫీల్ అయ్యాయని అన్నాడు. అయితే ఈవీవీ సత్యనారాయణ తనని మందలించలేదని.. వాస్తవానికి ఈ సంఘటన వల్ల తన పని తాను చేశాడనుకొని ఈఏవీ అనుకున్నారని దర్శకుడు వీరభద్రం చెప్పుకొచ్చారు.