Begin typing your search above and press return to search.
నాగార్జునను వెయిటింగ్ లో ఉంచిన డైరెక్టర్
By: Tupaki Desk | 4 Jan 2021 10:00 PM ISTకరోనా లాక్ డౌన్ తర్వాత సీనియర్ హీరోల్లో మొదటగా కెమెరా ముందుకు వచ్చిన హీరో నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 4 మరియు వైల్డ్ డాగ్ సినిమా కోసం నాగార్జున రిస్క్ అయినా షూటింగ్ లో పాల్గొన్నాడు. సమయం ఎక్కువగా వృదా కానివ్వకూడదు అనే ఉద్దేశ్యంతో నాగార్జున కరోనా సమయంలో కూడా వైల్డ్ డాగ్ సినిమాను పూర్తి చేశాడు. వైల్డ్ డాగ్ సినిమాను అతి త్వరలోనే ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. వైల్డ్ డాగ్ మరియు బిగ్ బాస్ పూర్తి అయిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ లోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున మూవీ పట్టాలెక్కాల్సి ఉంది. కాని స్క్రిప్ట్ వర్క్ లో కాస్త జాప్యం అవ్వడం వల్ల జనవరికి వాయిదా వేశారు. ప్రవీణ్ సత్తారు స్క్రిప్ట్ ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తాడా అంటూ నాగార్జున వెయిట్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ప్రవీణ్ సత్తారుకు నాగార్జున డెడ్ లైన్ పెట్టాడట. అప్పటి వరకు స్క్రిప్ట్ రెడీ కాకుంటే మరో దర్శకుడితో మూవీకి రెడీ అవుతాను అని.. ఆ తర్వాత నీ సినిమా ఉంటుందని కూడా దర్శకుడితో నాగ్ చెప్పారని మీడియా వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ నెల చివరి వరకు ప్రవీణ్ సత్తార్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తాడేమో చూడాలి. మరో వైపు బంగార్రాజు సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రవీణ్ సత్తారు రెడీ కాకుంటే బంగార్రాజుకు నాగ్ కమిట్ అవుతాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.