Begin typing your search above and press return to search.

వారసుడుని సీరియల్ తో పోల్చడంపై డైరెక్టర్ ఫైర్

By:  Tupaki Desk   |   18 Jan 2023 5:34 AM GMT
వారసుడుని సీరియల్ తో పోల్చడంపై డైరెక్టర్ ఫైర్
X
ఇళయదళపతి విజయ్ హీరోగా నటించి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం వారసుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో వారిసు టైటిల్ తో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మొదటి రోజు నుంచే యావరేజ్ టాక్ వచ్చింది.

ముఖ్యంగా రివ్యూలు రాసే సినిమా క్రిటిక్స్ వారిసు మూవీ సీరియల్ తరహాలో ఉంది అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఎమోషనల్ డ్రామా ని టూమచ్ గా చూపించారని పాయింట్ అవుట్ చేశారు. దీనిపై తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఒక సినిమా వెనుక ఎంతమంది కష్టం ఉంటుందో మీకు తెలుసా. ఎంత డెడికేషన్ ఉంటుందో తెలుసా. స్టార్ హీరో విజయ్ ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటే ఆ స్థాయిలో నటించి ఉంటారో మీకు తెలుసా. ఎంతమంది టెక్నికల్ గ్రూప్ సినిమా కోసం రాత్రి పగలు అనకుండా కష్టపడి ఉంటారో మీకు తెలుసా. ఇంత కష్టంతో సినిమాని ప్రేక్షకుల కోసం అందించాలని తపనతో తీసి రిలీజ్ చేస్తే రివ్యూల పేరుతో సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.

సినిమా సీరియల్ లా ఉందని ఎలా పోల్చి చెబుతారు అంటూ సీరియస్ అయ్యారు. ఫైనల్ జడ్జిమెంట్ అనేది ప్రేక్షకుల నుంచి వస్తుంది. అది అసలైన రివ్యూ. అది ఎలా ఉన్నా మేము అంగీకరిస్తాం. మధ్యలో సినిమా బాగోలేదని ప్రచారం చేయడానికి మీకు ఉన్న రైట్స్ ఏంటి అంటూ ప్రశ్నించారు. అలాగే సీరియల్స్ ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు. సినిమా లాగే సీరియల్ కూడా క్రియేటివ్ వర్క్.

దానికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది టెక్నీషియన్స్ కష్టపడుతూ ఉంటారు. దేనికి ఉండాల్సిన ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇలా సినిమాని సీరియల్ తో పోల్చి రివ్యూలు రాయడం సరైన పద్ధతి కాదు అంటూ విమర్శించారు. వారిసు మూవీ ప్రేక్షకులను ఆదరణ అందుకొని కలెక్షన్స్ పరంగా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు హిట్ టాక్ దిశగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి రివ్యూలు రాసే క్రిటిక్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినట్లు తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.