Begin typing your search above and press return to search.
దర్శకేంద్రుని మాజీ కోడలు అక్కడ దుమ్ము దులిపేస్తోంది!
By: Tupaki Desk | 30 July 2022 10:00 AM ISTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వారసుడు ప్రకాష్ కోవెలమూడి వ్యక్తిగత వృత్తిగత జీవితం తెరచి ఉంచిన పుస్తకం. అతడు తండ్రి లా పెద్ద సక్సెస్ కాలేకపోయారు. దర్శకుడిగా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక వ్యక్తిగత జీవితంలోనూ వైఫల్యం ఇంతకుముందు అభిమానులను కలవరపరిచింది.
అతని మాజీ భార్య కనికా థిల్లాన్ కొన్ని సినిమాలకు స్క్రిప్టు రైటర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. అనుష్కతో సైజ్ జీరో తెరకెక్కించిన ప్రకాష్ కోవెలమూడికి స్క్రిప్టు అందించింది కనికా థిల్లాన్. భర్తతో కలిసి పలు చిత్రాలకు పని చేసింది. కానీ అవేవీ ఆశించిన విజయాలు దక్కలేదు. కానీ కనిక బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ సాధించారు. 2022-23 సీజన్ బెస్ట్ సినిమాలకు ఆమె స్క్రిప్ట్ రైటర్ గా పని చేస్తుండడం ఆసక్తికరం.
సుశాంత్ సింగ్ -కేదార్‌నాథ్ (2018).. తాప్సీ- రష్మీ రాకెట్ (2021)- కంగన మెంటల్ హై క్యా చిత్రాలకు కనక రైటర్. తదుపరి అక్షయ్ కుమార్ నటిస్తున్న రక్షా బంధన్ కి.. కింగ్ ఖాన్ షారూక్ నటిస్తున్న డుంకీ చిత్రాలకు కనిక స్క్రిప్టు పరంగా సహాయం చేస్తున్నారు. బాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్లతో తను బిజీ రైటర్ గా కొనసాగుతుండడం ఆసక్తికరం. భవిష్యత్ లో మరెన్నో క్రేజీ చిత్రాలకు కనిక పని చేయనున్నారు.
ఈ శుక్రవారం కనక స్క్రిప్టు పరంగా సహకారం అందించిన ఏక్ విలన్ రిటర్న్స్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఏక్ విలన్ రిటర్న్స్ కంటెంట్ డైలాగులు బావున్నాయని టాక్ వినిపించింది. ఈ మూవీ మంచి ప్రారంభాన్ని పొందుతుందని భావిస్తున్నారు. జాన్ అబ్రహం- అర్జున్ కపూర్- దిశా పటాని - తారా సుతారియా నటీనటులుగా మోహిత్ సూరి-దర్శకత్వంలో తెరకెక్కింది.
ఈ మూవీ కథలో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు మలుపులు ఉన్నాయన్న టాక్ వినిపించింది. ఈ మూవీకి డైలాగులు అందించిన కనిక థిల్లాన్ కి `ప్రత్యేక ధన్యవాదాలు` చెబుతూ తెరపై తన పేరును టైటిళ్లలో ప్రదర్శించారు.
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రోహిత్ శెట్టి - ప్రఖ్యాత రచయిత కనికా ధిల్లాన్ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ టైటిల్ కార్డ్స్ లో వేసారు. కేదార్‌నాథ్ (2018)- రష్మీ రాకెట్ (2021) .. రాబోయే రక్షా బంధన్ .. డంకీ ఫేమ్ గా కనిక పేరు మార్మోగుతోంది. ఈ ఇద్దరూ ఇంతకు ముందు మోహిత్ సూరితో కలిసి పనిచేయలేదు. పైగా వారి సినిమా జోనర్లు మోహిత్ సూరి కంటే భిన్నంగా ఉంటాయి. కానీ ఆ ఇద్దరి పనీ ముఖ్యంగా కనిక డైలాగులు థియేటర్లలో పెద్దగా పేలుతున్నాయి.